Schools Closed & Work from Home: స్కూళ్లు బంద్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
నవంబర్ 5 నుంచి ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో 50శాతం మందికి నవంబర్ 7 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టుగా వెల్లడించింది. ప్రైవేటు కార్యాలయాలు కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని సూచించింది. సీనియర్ విద్యార్థులెవరూ ఔట్ డోర్ కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసినట్టుగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ నవంబర్ 4న విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రవాణా సాధనాలకు సంబంధించి డీజిల్‌తో నడిచే వాహనాలపై నిషేధం విధించింది. సీఎన్‌జీతో నడిచే పర్యావరణం బస్సు సరీ్వసులను మొదలు పెట్టనుంది. మార్కెట్లు, కార్యాలయాల సమయాలను కుదిరంచడానికి కసరత్తు చేస్తోంది. అవసరమైతే సరి, బేసి విధానాలతో వాహనాలను బయటకు తీసే పద్ధతి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ సిఫారసుల మేరకు కాలుష్యం కట్టడికి ఈ చర్యలు తీసుకుంటున్నట్టు రాయ్ వెల్లడించారు
చదవండి: Schools: ఇక్కడి స్కూళ్లలో ఔట్‌డోర్ బంద్.. ఈ తరగతి పిల్లలకు ఆన్‌లైన్‌లోనే క్లాసులు..
పంజాబ్ పంట వ్యర్థాల దహనాల బాధ్యత మాదే : కేజ్రీవాల్
అంతకు మందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్‌తో కలిసి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ కాలుష్యం అంశంలో ఒకరిపై మరొకరు నిందారోపణలు వేసుకోవద్దని అన్నారు. పంజాబ్‌లో కూడా ఆప్ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో అక్కడ పంట వ్యర్థ్యాల దహనాలకు తమదే బాధ్యతని పేర్కొన్నారు. ఉత్తర భారతం యావత్తూ కాలుష్యంతో నిండిపోయిందని అందుకే కేంద్రం కూడా బాధ్యత తీసుకొని కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు పంజాబ్ సీఎం భగవంత్ మన్ 2022లో రికార్టు స్థాయిలో వరి పండడంతో పంట వ్యర్థాల దహనం ఎక్కువగా జరుగుతోందని అంగీకరించారు.
చదవండి: International Literacy Day: అక్షరాస్యతలో టాప్ 5 రాష్ట్రాలు
ప్రమాదకరంగా కాలుష్యం
ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 500కి చేరువులో నమోదవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి 445కి చేరింది. రాజధానిలో ఉన్న దాదాపుగా అన్ని గాలి నాణ్యత పర్యవేక్షణా స్టేషన్లు కాలుష్యం ప్రమాదకంగా మారిందని తేటతెల్లం చేస్తున్నాయి. 13 స్టేషన్లలో గాలి కాలుష్యం 450కంటే ఎక్కువగా నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కాలుష్యం 400 దాటిందంటే అత్యంత తీవ్రమైనదిగా భావించాల్సి ఉంటుంది. దీని వల్ల వ్యాధులు మరింత విజృంభించే అవకాశాలుండడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: Arvind Kejriwal: దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్
నాలుగు రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
ఢిల్లీ దాని చుట్టుపక్కల ఉన్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణాలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై మాట్లాడానికి ఈ నెల 10న తమ ఎదుట హాజరుకావాలంటూ నాలుగు రాష్ట్రాల ప్రధాన కార్యర్శులకు నోటీసులు పంపింది. కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తమకు సంతృప్తి లేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. గాలి నాణ్యత సూచి 400కి పైన ఉంటే ఆరోగ్య వంతులు కూడా వ్యాధుల బారిన పడతారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన వ్యక్తం చేసింది.
చదవండి: Air pollution in Delhi: ఢిల్లీలోనే అత్యధిక వాయు కాలుష్యం