Exams Reschedule: కేయూ పరిధిలో వివిధ పరీక్షల రీషెడ్యూల్‌

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాయిదాపడిన బీటెక్‌, బీఫార్మసీ, ఫార్మ్‌డీ పరీక్షలను ఆగ‌ష్టు 1న‌ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి మల్లారెడ్డి,అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ రాధిక రీషెడ్యూల్‌ చేశారు.
కేయూ పరిధిలో వివిధ పరీక్షల రీషెడ్యూల్‌

జూలై 26, 27, 28, 31, ఆగస్టు , 2,3 తేదీల్లో వాయిదా పడిన పరీక్షలకు మళ్లీ రీషెడ్యూల్‌ చేశారు. బీఫార్మసీ 8వ సెమిస్టర్‌ పరీక్షలు ఆగ‌ష్టు 4న, 7న, బీఫార్మసీ ఏడో సెమిస్టర్‌ పరీక్షలు ఆగ‌ష్టు 5న, 8న నిర్వహించనున్నామని తెలిపారు. ఫార్మ్‌డీ మూడో సంవత్సరం పరీక్షలు ఆగ‌ష్టు 14న, 17న, ఫార్మ్‌డీ నాలుగో సంవత్సరం పరీక్షలు 11, 16,18 తేదీల్లో నిర్వహిస్తారు. ఫార్మ్‌ డీ ఐదవ సంవత్సరం పరీక్షలు ఆగ‌ష్టు 12న నిర్వహిస్తారు.

చదవండి: Kakatiya University: పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా రవికుమార్‌ బాధ్యతల స్వీకరణ

వాయిదాపడిన బీటెక్‌ నాన్‌ సీబీసీఎస్‌ పరీక్షలు రీషెడ్యూల్‌..

కేయూ పరిధిలో బీటెక్‌నాన్‌ సీబీసీఎస్‌ పరీక్షల రీషెడ్యూల్‌ చేశారు. బీటెక్‌ నాలుగో సంవత్సరం 1వ సెమిస్టర్‌ పరీక్షలు ఆగ‌ష్టు 4న, బీటెక్‌ మొదటి సంవత్సరం పరీక్షలు 4న, బీటెక్‌ మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు, రెండో సెమిస్టర్‌ పరీక్షలు 5న, బీటెక్‌రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్‌, రెండో సెమిస్టర్‌పరీక్షలు ఆగ‌ష్టు 7న నిర్వహిస్తారు. జూలై 27న వాయిదా పడిన బీటెక్‌ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఆగ‌ష్టు 8న నిర్వహిస్తారని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి మల్లారెడ్డి,అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక తెలిపారు. పరీక్షలరీషెడ్యూల్‌ వివరాలు కేయూ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు.

చదవండి: Guest Lecturer Posts: వివిధ కళాశాలల్లో గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలకు రీషెడ్యూల్‌..

కేయూ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ కోర్సులు బీ ఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర ఆరో సెమిస్టర్‌ పరీక్షల్లో పలు పేపర్ల పరీక్షలను అధికారులు రీషె డ్యూల్‌ చేశారు. జూలై 26న వాయిదా పడిన పే పర్ల పరీక్షలు ఆగస్టు 4న, జూలై 27న వాయిదాపడిన వివిధ సబ్జెక్టుల పేపర్ల పరీక్షలు ఆగస్టు 5న ని ర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి ఆగ‌ష్టు 1న‌ తెలిపారు.
 

#Tags