స్కూళ్ల ఆధునీకరణకు పీఎంశ్రీ

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలల పురోభివృద్ధికి ఉద్దేశించిన కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 5న ఆవిష్కరించారు.
స్కూళ్ల ఆధునీకరణకు పీఎంశ్రీ

దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలల అభివృద్ధి, ఆధునికీకరణే ధ్యేయంగా Pradhan Mantri Schools for Rising India(PM-SHRI) యోజనను ప్రారంభిస్తున్నట్లు మోదీ ట్వీట్లు చేశారు. New National Education Policy(NEP) స్ఫూర్తికి కొనసాగిస్తూ ఈ ముందడుగు వేశామని పీఎం–శ్రీనుద్దేశిస్తూ మోదీ అన్నారు. ‘పీఎం–శ్రీతో ఈ 14,500 పాఠశాలలు ఇకపై మోడల్‌ స్కూళ్లుగా భాసిల్లుతాయి. స్కూళ్లలో స్మార్ట్‌ తరగతి గదులు, నవీకరించిన మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, ల్యాబ్‌లతోపాటు ఆధునాతన, సంస్కరణాత్మక, కొత్త తరహాలో బోధన కొనసాగుతుంది. పీఎం–శ్రీతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ధిపొందుతారు’ అని మోదీ మరో ట్వీట్‌చేశారు. మరోవైపు, ‘రెండున్నర శతాబ్దాలు దేశాన్ని పాలించిన బ్రిటన్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదిగింది. ఇది నిజంగా ప్రత్యేకం’ అని మోదీ ట్వీట్‌చేశారు. 

చదవండి: 

#Tags