New Medical Colleges: పులివెందుల, పాడేరు మెడికల్‌ కాలేజీలకు అనుమతులు

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో కొత్త వైద్య కళాశాలకు అనుమతులు రాకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డినప్పటికీ అనుమతులు రాక మానలేదు.

2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్‌ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. దీంతోపాటు పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లను మంజూరు చేశారు.

వాస్తవానికి ఈ రెండు కళాశాలలతో పాటు, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 సీట్లతో తరగతులు ప్రారంభించాలని గత ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు.

చదవండి: Malaysian Man: రికార్డ్‌.. 70 ఏళ్ల వయసులో మెడికల్‌ గ్రాడ్యుయేట్ చేసిన మలేసియా వ్యక్తి

అయితే, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు ప్రభుత్వం కావాలని అనుమతులు రాబట్టేలా చర్యలు తీసుకోలేదు. దీంతో తొలివిడత తనిఖీల అనంతరం ఐదుచోట్ల కొంతమేర వసతుల కొరత ఉన్నాయని ఎన్‌ఎంసీ అనుమతులు నిరాకరించింది.

తొలివిడత తనిఖీల్లో తీసుకున్న నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో అధికారులకు అనుమతులిచ్చిప్పటికీ వసతుల కల్పన మాత్రం చేపట్టలేదు.

దీంతో గత ప్రభుత్వంలో కల్పించిన వసతుల ఆ«ధారంగా వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌ అనంతరం ప్రభుత్వం అండర్‌ టేకింగ్‌ ఇస్తే పులివెందులకు 50 సీట్లు మంజూరు చేస్తామని ఎన్‌ఎంసీ ప్రకటించింది.

చదవండి: Free Training: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉపాధి కోర్సులపై ఉచిత శిక్షణ

అయినప్పటికీ ప్రభుత్వం అండర్‌టేకింగ్‌ ఇవ్వ­లేదు. అండర్‌టేకింగ్‌ ఇవ్వకపోయినప్పటికీ ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరుచేయడంతో వైద్యశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

#Tags