Pchum Ben Festival: దెయ్యాలకు బోజనం.. రెండు రోజులు సెల‌వు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. ఎక్క‌డంటే..

ప్రతీ దేశంలో విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. కానీ కొన్ని దేశాల్లో పండుగలు అత్యంత విచిత్రంగా ఉంటాయి.

ఆ సంప్రదాయాలను చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.. అలాంటి విచిత్రమైన సంప్రదాయమే కంబోడియాలో ఉంది. ఆ పండుగను చేసుకోవడం కోసం ప్రభుత్వం కూడా రెండు రోజులు సెలవు ప్రకటిస్తుంది. 

దెయ్యాలకు ఆహారం పెట్టే ఫెస్టివల్ కంబోడియాలో జరుపుకునే విచిత్రమైన పండుగ. దీన్ని అక్కడ ప్రజలు 'ఖైమర్‌ పండుగ' అని పిలుస్తారు. 15 రోజులు పాటు జరుపుకునే ఈ పండుగ‌ సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్య కాలంలో ఉంటుంది. ఆకలితో ఉన్న దెయ్యాలు ఆ స‌మ‌యంలో నరక ద్వారం నుంచి బయటకు వచ్చి తమ నివాసాల వద్ద సంచరిస్తాయ‌ని కంబోడియా వాసులు విశ్వసిస్తారు. ఆ సమయంలోనే నరక ద్వారాలు తెరచుకుంటాయని, అందువల్లే వివిధ రకాల ఆత్మలు తమ నివాసాల వద్దకు వస్తాయని చెబుతున్నారు.

Garisenda Tower: వెయ్యేళ్ల టవర్‌.. ఎప్పుడు కుప్ప‌కూలుతుందో తెలియ‌దు.. కార‌ణం ఇదే..

ఈ పండుగ రోజున ప్రజలు దెయ్యాల కోసం వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి రాత్రి సమయాల్లో పెడతారు. ఎందుకంటే దెయ్యాలకు వెలుతురు ఇష్టం ఉండదు కాబ‌ట్టి. అవి చీకటిలోనే ఉంటాయి. అందుకని ఉదయం లేచి సూర్యోదయం కాకమునుపే తమ కుటుంబంలో చనిపోయిన బంధువులను తలుచుకంటూ ఆహారం పెడుతుంటారు. ఇలా చేస్తే రాక్షసులు సంతోషిస్తారట. అందువల్ల తమకు ఎలాంటి కీడు సంబ‌వించ‌కుండా ఉండటమే గాక సంతోషంగా జీవించగలుగుతామని చెబుతున్నారు.

ఈ పండుగ రోజును తమ చనిపోయిన ఏడు తరాల బంధువులను తలుచుకుని భోజనం పెడతారు. దెయ్యాలు ఇలా తమ బంధువుల పేరు మీద పెట్టిన భోజనాన్ని వారి దగ్గర నుంచి తీసుకుని తింటాయని అంటున్నారు. దీన్ని "ఫచమ్‌ బెన్‌"గా వ్యవహారిస్తారు. ఈ పండుగను 19వ శతాబ్దం కింగ్‌ ఆంగ్ డుయోంగ్ కాలం నుంచి ప్రజలు ఆచరిస్తున్నారు. అంతేకాదు ఈ పండుగ చివరి రోజున జరుపుకునే ఉత్సవానికి అక్కడి ప్రభుత్వం సెలవు ఇస్తుంది. పండుగ చివరి రోజున దెయ్యాల కోసం ఓ పడవలో నిండుగా వివిధ రకాల పిండి పదార్థాలన్ని పెట్టి కొంత దూరం వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడికి వివిధ ఆత్మలు వచ్చి ఆహార పదార్థాలతో ఆకలి తీర్చుకుని తిరిగి నరకానికి వెళ్లిపోతాయని చెబుతున్నారు కంబోడియా ప్రజలు.

Hurricanes: తుపానులకు వింత వింత పేర్లు.. పెట్టేది ఎవరు..? అస‌లుపేరెందుకు పెడ‌తారో తెలుసా..?

#Tags