ఉస్మానియా వైద్య కళాశాలకు ఈ గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా వైద్య కళాశాలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఓ) గుర్తింపు లభించింది.
ఐఎస్ఓ సంస్థ నుంచి జూలై 25న వచ్చిన ప్రతినిధులు శివయ్య, సుందర రామయ్యలు గుర్తింపు పత్రాన్ని కళాశాల ప్రిన్సిపల్ శశికళారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శశికళారెడ్డి మాట్లాడుతూ... కళాశాలలో నాణ్యమైన విద్యా ప్రమాణాలు, భద్రత, సామర్థ్యం, పర్యావరణం, అధ్యాపకుల విద్యాబోధనలు, ఉద్యోగుల కృషి మూలంగానే ఈ గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో తొలిసారి ఐఎస్‌ఓ గుర్తింపు ఉస్మానియా కళాశాలకు రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ప్రొఫెసర్లు డాక్టర్ భవాని, డాక్టర్ కిరణ్మయ్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
#Tags