Skip to main content

Govt Degree College: పాడేరు డిగ్రీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు

SIO Recognition of Government Degree College

సాక్షి, పాడేరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎస్‌ఐవో గుర్తింపు లభించినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వనము చిట్టబ్బాయి తెలిపారు. ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ ఎనర్జీ సేవింగ్‌ ప్రాక్టీసెస్‌, ప్రొవైడింగ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌, ఇంప్లిమెంటేషన్‌ ఆక్టివిటీస్‌ గుర్తింపులను కళాశాల సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఐఎస్‌వో సిబ్బంది గురువారం విశాఖలో అందజేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ను వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టిఎస్‌.రసూల్‌, సీనియర్‌ అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు అభినందించారు.

చ‌ద‌వండి: Guest Lecturer Jobs: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 08 Dec 2023 06:15PM

Photo Stories