Open 10th Class & Inter Admissions: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఇదే

షాద్‌నగర్‌రూరల్‌: తెలంగాణ సార్వత్రిక విద్యా పరిషత్‌ ద్వారా పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా షాద్‌నగర్‌ పట్టణంలోని ఎయిడెడ్‌ జియోన్‌ పాఠశాలలో ప్రవేశాలు పొందవచ్చన్నారు.

Job Mela: 600 పోస్టులు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

అనివార్య కారణాలతో చదువుకు దూరమైన యువతీ యువకులు, మహిళా సంఘాల సభ్యులు, ఆశ వర్కర్లు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. పదో తరగతి, ఇంటర్‌ ఫెయిల్‌ అయి చదువు మధ్యలోనే ఆపేసిన వారు మళ్లీ అక్షరజ్ఞానం సాధించేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

Job Mela: ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్‌మేళా.. అర్హతలు ఇవే

ఏదైనా పాఠశాల ధ్రువీకరణ పత్రంతో అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చే నెల 3వ తేదీ వరకు అవకాశం ఉందని వివరించారు.

#Tags