Gurukulam Spot Admissions: ‘గురుకులం’ స్పాట్ అడ్మిషన్లలో గందరగోళం
రాత్రి ఎనిమిది గంటలైనా అధికారులు సీట్లు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించారు. దీంతో అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిషన్ల వద్ద కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు తల్లిదండ్రులు గుక్కెడు నీటి కోసం అల్లాడారు.
చదవండి: Samantha 10th Class Marks sheet: సమంత ఏం చదువుకుందో తెలుసా? నటనలోనే కాదు, చదువులోనూ టాపర్!
ఆర్‌సీఓ, డీసీఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి కౌన్సెలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన కొనసాగించారు. కాగా, సీట్ల కేటాయింపు వివరాలు ఫోన్ ద్వారా తెలుపుతామని జోనల్ ఇన్‌చార్జ్ స్వరూపరాణి తెలిపారు. సీట్లు నిబంధనల ప్రకారం కేటాయించకుండా అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నరని విద్యార్థులు, తల్లిందండ్రులు ఆరోపించారు.
Tags
- Gurukulam Spot Admissions
- Boys Social Welfare School
- Counseling for Spot Admissions
- Zonal in charge Swaruparani
- Hanamkonda District News
- Telangana News
- admissions
- MadikondaAdmissions
- SpotAdmissions
- VardhannapetSchool
- AdmissionsCounseling
- SeatAllocation
- SchoolChaos
- ParentFrustration
- OfficialNeglect
- sakshieducationlatest news