Skip to main content

Samantha 10th Class Marks sheet: సమంత ఏం చదువుకుందో తెలుసా? నటనలోనే కాదు, చదువులోనూ టాపర్‌!

samantha 10thmarks sheet viral news  Samantha 10th Class Marks sheet  Samantha Ruth Prabhu class 10th marksheet

స్టార్‌ హీరోయిన్‌ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమంత ఎ‍ప్పుడూ ఏదో ఒక అంశంలో హెడ్‌లైన్స్‌లో నానుతుంటుంది. తాజాగా సామ్‌కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. నటనలోనే కాదు, చదువులోనూ సమంత టాపర్‌ అన్న విషయం మీకు తెలుసా?

samantha 10th class marks sheet

ఇందుకు సంబంధించి సమంత మార్కుల మెమో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ రిపోర్ట్‌ కార్డులో సామ్‌ మార్కులు చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. చెన్నైలోని పల్లవరంలో పుట్టి పెరిగిన సమంత అక్కడే తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. స్టీఫెన్స్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివింది. టెన్త్‌ క్లాస్‌ హాఫ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌లో 1000 మార్కులకు గాను సమంతకు 887 మార్కులు వచ్చాయి.

samantha 10th class marks sheet

Bank Jobs 2024: ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో నెలకు రూ. 65వేల వేతనం.. అప్లై చేశారా?

అందులో అత్యధికంగా మ్యాథ్స్‌ పేపర్‌-1 లో 100కు వంద మార్కులు రాగా, రెండో పేపర్‌లో 99 మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌లో 90 మార్కులు, రెండో పేపర్‌లో 74 మార్కులు సాధించగా, తమిళంలో మొదటి పేపర్‌లో 83 మార్కులు, రెండో పేపర్‌లో 88 మార్కులు సాధించారు. అదేవిధంగా ఫిజిక్స్‌లో 95, బోటనీలో 84, హిస్టరీలో 91, జియోగ్రఫీలో 83 మార్కులు సాధించారు.

samantha 10th class marks sheet

RBI Online Quiz Competition For Degree Students: డిగ్రీ విద్యార్థులకు ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌.. రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ

ఈ ఫలితాల్లో క్లాస్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన సమంతను ప్రశంసిస్తూ..సమంత ఈ స్యూల్ లో చదవడం మా లక్కీ అంటూ టీచర్‌ ఆ రిపోర్ట్‌లో పేర్కొనడం విశేషం. ప్రస్తుతం సామ్‌ మార్కుల లిస్ట్‌ చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. నటనలోనూ అనుకున్నాం, చదువులోనూ సామ్‌ చురుకే అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇక 2007లో చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్‌లో బీకాం పూర్తి చేసిన సమంత ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 

Published date : 13 Sep 2024 03:40PM

Photo Stories