Kakatiya University: కేయూ డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పెంపు

కేయూ క్యాంప్‌స: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు సంబంధించి మొదటి, మూడో, ఐదో సెమిస్టర్‌ పరీక్షల ఫీజు చెల్లించే గడువు అపరాధ రుసుము లేకుండా డిసెంబ‌ర్ 4వ తేదీ వరకు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ తిరుమలాదేవి డిసెంబ‌ర్ 1న‌ ఒక ప్రకటనలో తెలిపారు.రూ.50 అపరాధ రుసుముతో డిసెంబ‌ర్ 8వ తేదీ వరకు గడువు ఉందని వారు పేర్కొన్నారు.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకు ని సకాలంలో ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావాలని కోరారు.

చదవండి:

Free training for group exams: సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్స్‌కు ఉచిత శిక్షణ

Job Trends: స్కిల్‌ ఉంటేనే.. కొలువు!

#Tags