Skip to main content

Breaking News Results Released: యూనివర్సిటీ ఫలితాలు విడుదల

Results Released  KU Distance Education Degree Exam Results  Kakatiya University BA, BCom, BSC, BBA Results  Kakatiya University Examination Results Announcement  KU Distance Education First, Second, Final Year Results
Results Released

కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల మొదటి, ద్వితీయ, ఫైనల్ ఇయర్ పరీక్షల ఫలితాలను రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి, పరీక్షల నియం త్రణాధికారి ఎస్. నర్సింహాచారి శనివారం విడుదల చేశారు. 

35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌: Click Here

బీఏ మొదటి సంవత్సరంలో 50.31శాతం, రెండో సంవత్సరం 55.52 శాతం, తృతీయ సంవత్సరంలో 59.31శాతం ఉత్తీర్ణత సాధించారు. బీకాం మొదటి సంవత్సరంలో 36.45శాతం, ద్వితీయ సంవత్సరంలో 23.82 శాతం, తృతీయ సంవత్సరంలో 26.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

బీఎస్సీలో మొదటి సంవత్సరంలో 17.650, ద్వితీయ సంవత్సరంలో 15.28శాతం, తృతీయ సంవత్సరంలో 8.57 శాతం ఉత్తీర్ణత సాధించారని పరీక్షల నియంత్ర ణాధికారి నర్సింహాచారి తెలిపారు. బీబీఏ రెండో సంవత్సరంలో 20 శాతం, బీబీఏ తృతీయ సంవత్సరంలో 42.11శాతం మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. 
కార్యక్రమంలో కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారులు నరేందర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Published date : 27 Aug 2024 08:22AM

Photo Stories