‘తెలంగాణలో పెరిగిన నిరుద్యోగం’
మే నెలతో పోల్చితే జూన్‌లో తెలంగాణలో నిరుద్యోగ రేటు పెరగ్గా.. ఆంధ్రప్రదేశ్‌లో యథాతథంగా ఉంది.
దేశం, రాష్ట్రాల వారీగా నెలవారీ నిరుద్యోగ రేటు నివేదికను Centre for Monitoring Indian Economy (CMIE) విడుదల చేసింది. మేలో తెలంగాణలో 9.4 శాతం నిరుద్యోగ రేటు ఉండగా జూన్‌లో అది 10 శాతానికి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మే నెలలో నమోదైన 4.4 శాతం నిరుద్యోగ రేటు జూన్‌లోనూ కొనసాగిందని సీఎంఐఈ వెల్లడించింది. జాతీయ సగటు కంటే ఏపీలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా మేలో 7.12 శాతం నిరుద్యోగ రేటు ఉండగా జూన్ నాటికి అది 7.8 శాతానికి పెరిగింది. దేశంలో అత్యధికంగా హరియాణాలో 30.6 శాతం, అత్యల్పంగా పుదుచ్చేరిలో 0.8 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది.
చదవండి:
#Tags