Skip to main content

27.11 శాతంగా నిరుద్యోగ రేటు: సీఎంఐఈ

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా నిరుద్యోగ రేటు మే 3వ తేదీతో ముగిసిన వారంలో 27.11 శాతానికి పెరిగిందని ‘సెంటర్‌ ఫర్ మానిట‌రింగ్ ఇండియన్‌ ఎకానమీ’ (సీఎంఐఈ) అనే సంస్థ మే 5న వెల్లడించింది.
Current Affairs

మార్చిలో కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చకముందు నిరుద్యోగ రేటు 7 శాతంగానే ఉన్నట్టు తెలిపింది. నిరుద్యోగ రేటు పట్టణాల్లోనే ఎక్కువగా ఉందని, కరోనా కారణంగా రెడ్‌ జోన్లు పట్టణాల్లో ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 29.22 శాతంగాను, గ్రామీణ ప్రాంతాల్లో 26.69 శాతంగాను ఉన్నట్టు తెలిపింది.


అత్యధికంగా పుదుచ్చేరిలో..

సీఎంఐఈ డేటా ప్రకారం.. నెలవారీ నిరుద్యోగ రేటు మార్చిలో 8.74 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లో 23.52 శాతంకి పెరిగిపోయింది. పుదుచ్చేరిలో అత్యధికంగా 75.8 శాతం, తమిళనాడులో 49.8 శాతం, జార్ఖండ్‌లో 47.1 శాతం, బిహార్‌లో 46.6 శాతం, మహారాష్ట్రలో 20.9 శాతం, హరియాణాలో 43.2 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 21.5 శాతం, కర్ణాటకలో 29.8 శాతంగా ఉన్నట్టు గణాంకాలను వెల్లడించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 27.11 శాతంగా నిరుద్యోగ రేటు
ఎప్పుడు : మే 5
ఎవరు : సెంటర్‌ ఫర్ మానిట‌రింగ్ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ)
ఎక్కడ : భార‌త్‌
ఎందుకు : కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా
Published date : 06 May 2020 08:47PM

Photo Stories