Collector Venkatesh Dotre: నర్సింగ్‌ విద్యార్థులకు వసతిగృహం

ఆసిఫాబాద్‌ రూరల్‌: రాబోయే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా కళాశాల వసతిగృహం ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు.

సెప్టెంబ‌ర్ 16న‌ జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్‌ జీపీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

చదవండి: Cancellation Of CBSE Teaching: ప్రభుత్వ స్కూలు పిల్లలపై ఎందుకీ వివక్ష?: వైఎస్‌ జగన్‌

భవన నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం వైద్య కళాశాలను పరిశీలించారు.

#Tags