వర్సిటీల్లో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయండి

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్‌ డిమాండ్‌ చేసింది.
వర్సిటీల్లో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయండి

ఈ మేరకు ఆ సంఘం చైర్మన్, ఓయూ పరిశోధక విద్యార్థి చనగాని దయాకర్‌ జనవరి 31న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా నిధులు, నియామకాలు చేపట్టనందున వర్సిటీలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: UGC: ఉన్నత విద్యలో ‘షేరింగ్‌’

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలోని వర్సిటీలకు పెద్ద పీటవేయాలని, నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశా రు. ప్రతి వర్సిటీకి రూ.వెయ్యి కోట్లు, విద్యుత్తు కోసం సోలార్‌ప్లాంట్లు, వర్సిటీల భూముల పరిరక్షణకు ప్రత్యేక చట్టం, మహిళావర్సిటీకి సావిత్రి బాయిఫులే పేరుపెట్టాలని కోరారు. లేని పక్షంలో ప్రభుత్వ వర్సిటీల పరిరక్షణకు పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు. 

చదవండి: విదేశీ వర్సిటీలకు మరింత స్వేచ్ఛ

#Tags