ప్రతి విద్యార్థికీ బాల్యంనుంచే ఓ కళ నేర్పించాలి

ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కళారూపాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు.
ప్రతి విద్యార్థికీ బాల్యంనుంచే ఓ కళ నేర్పించాలి

కనీసం పదోతరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన జరగడంతో పాటు ప్రతి విద్యార్థికీ బాల్యం నుంచే ఏదైనా ఓ కళను నేర్పించి వారిలో సృజనాత్మకతకు బాటలు వేయొచ్చన్నారు. తద్వారా బాల్యం నుంచే చిన్నారుల్లో కళలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయత భావన అలవడుతాయని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో ఏప్రల్‌ 9న నిర్వహించిన సంగీత, నాటక అకాడమీ అవార్డులు, లలితకళ అకాడమీ ఫెలోషిప్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. విజేతలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. బ్రిటిషర్ల అరా చకాన్ని ఎదిరించే ప్రయత్నంలో కళలు, సాంస్కృ తిక రూపాలు ప్రభావవంతమైన రాజకీయ ఆయు ధాలుగా ఉపయోగపడ్డాయన్నారు. అలాంటి భారతీయ కళ, సాంస్కృతిక రూపాలను కాపాడుకోవాలని చెప్పారు. 

తెలుగువారికి అవార్డులు

తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్లాది సూరిబాబు (కర్ణాటక సంగీతం), ఎస్‌. కాశీం, ఎస్‌. బాబు (నాదస్వరం), పసుమర్తి రామలింగ శాస్త్రి (కూచిపూడి), కోటా సచి్చదానంద శాస్త్రి (హరికథ) అవార్డులు అందుకున్నారు. 62వ జాతీయ ప్రదర్శన అవార్డుల్లో భాగంగా శిల్పకళల విభాగంలో తెలుగు యువకుడు జగన్మోహన్‌ పెనుగంటికి ఉపరాష్ట్రపతి అవార్డు అందజేశారు. 

#Tags