Skip to main content

CPGET 2024 Preliminary Answer Key Relesed: సీపీజీఈటీ-2024 ప్రిలిమినరీ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

CPGET 2024 Preliminary Answer Key Relesed preliminary answer key released by telenganagovernment

తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET 2024) ప్రిలిమినరీ కీ విడుదలయ్యింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అఫీషియల్‌ వెబ్‌సైట్‌ https://cpget.tsche.ac.in/లో కీని చెక్‌ చేసుకోవచ్చు.

ఏమైనా అభ్యంతరాలు ఉంటే రేపటి(జులై 25)లోగా నమోదు చేయాల్సి ఉంటుంది. సీపీజీఈటీ ఫలితాలు ఈనెల చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా పీజీకి సంబంధించిన పలు కోర్సులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీపీజీఈటీ పేరుతో కామన్ ఎంట్రన్స్ నిర్వహిస్తోంది.

Hardware Engineer Success Story: ఇస్రోలో ఉద్యోగం వచ్చినా వదులుకుంది.. కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది

ఈ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు,  జేఎన్టీయూ, శాతవాహన యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారన్న విషయం తెలిసిందే. 

TS CPGET Answer Key 2024.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ TS CPGET tscpget.comను క్లిక్‌ చేయండి
  • తర్వాత హోంపేజీలో TS CPGET 2024 Answer Key అనే లింక్‌పై క్లిక్‌ చేయండి
  • మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలను ఎంటర్‌ చేయండి
  • తర్వాతి స్క్రీన్‌లో మీకు ఆన్సర్‌ కీ డిస్‌ప్లే అవుతుంది
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి
Published date : 24 Jul 2024 05:57PM

Photo Stories