Agricultural Education: డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ఆహారభద్రతకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ విద్యావిధానం ఆధునికతను సంతరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్

ఆ లక్ష్య సాధన దిశగా యువత వ్యవసాయ రంగంలో నిలదొక్కుకునేలా ప్రోత్సహించాలన్నారు. మార్చి 4న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 51వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. విజయవాడలోని రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ ప్రసంగిస్తూ డిజిటల్‌ యుగపు సాంకేతికతను వ్యవసాయ రంగం అందిపుచ్చుకోవాలని సూచించారు. స్మార్ట్‌ టెక్నాలజీ ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనాలను కలిగించే చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో పుష్కలంగా ఉన్న అవకాశాలను సది్వనియోగం చేసుకుని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించి వారి జీవన ప్రమాణాలు పెంపొందించాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ వర్షాధార ప్రాంత ప్రాధికార సంస్థ (న్యూడిల్లీ) సీఈవో అశోక్‌ దళ్వాయికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. 

చదవండి: 

​​​​​​​‘ఐసీఏఆర్’ ర్యాంకింగ్స్ లో బెస్ట్ యూనివర్సిటీలు ఇవే

ఈ కోర్సులకు గిరాకీ

దూరవిద్యలో వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులు!

#Tags