ఈ కోర్సులకు గిరాకీ
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గుంటూరుకు సమీపంలోని లాం ఫాంలో మూడేళ్ల బీఎస్సీ గృహ విజ్ఞాన కోర్సును నాలుగేళ్ల సామాజిక విజ్ఞాన శాస్త్రం (ఆనర్స్)గా మార్చి అమలు చేస్తున్నారు.
ఈ కోర్సుకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడింది. నవంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్కు పంపాలి. ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూపులతో ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు. గృహ విజ్ఞాన విభాగంలో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా పది శాతం సీట్లు కేటాయించారు. 2020 డిసెంబర్ 31నాటికి 22 ఏళ్లులోపున్న వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు, దివ్యాంగులైతే 27 ఏళ్లు మించకూడదు. ఇంటర్లో ఆప్షనల్ సబ్జెక్ట్ల మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
Published date : 31 Oct 2020 02:59PM