Andhra Pradesh: డిప్లొమా ఇన్‌ జర్నలిజం అభ్యర్థులకు సర్టిఫికెట్లు.. ఈ టూల్స్‌పై శిక్షణ..

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, సి.రాఘవా­చారి మీడియా అకాడమీ సంయుక్తంగా నిర్వ­హించిన డిప్లొమా ఇన్‌ జర్నలిజం కోర్సు­లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డిసెంబ‌ర్ 29వ తేదీన సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు సి.రాఘవా­చారి ఆంధ్రప్రదేశ్‌ మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు డిసెంబ‌ర్ 26న‌ ఓ ప్ర­క­టనలో తెలిపారు.

గుంటూరు నాగార్జున యూ­ని­వర్సిటీ క్యాంపస్‌లోని ప్రొఫెసర్‌ బాల­మో­హన్‌ దాస్‌ సెమినార్‌ హాల్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి వర్సి­టీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ ముఖ్య­అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 

చదవండి: Doctor to Collector: డాక్టర్ నుంచి కలెక్టర్‌గా మారిన యువతి..

అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌పై శిక్షణ

సర్టిఫికెట్ల పంపిణీ తర్వాత అదే హాలులో ‘అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ ఫర్‌ ఈ–పబ్లిషింగ్‌’ కోర్సులో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి­న­ట్లు తెలిపారు. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్, డిజిటల్‌ మీడియా రంగాల్లో ఆధునిక సాంకేతికతపై వర్కింగ్‌ జర్నలిస్టులకు వర్సిటీ ఇంజి­నీరింగ్‌ కళాశాల డీన్‌ డాక్టర్‌ ఈ.శ్రీనివాసరెడ్డి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

ఈ శిక్షణలో పా­ల్గొ­నాలనుకునే వర్కింగ్‌ జర్నలిస్టులు, చిన్న ప­త్రి­­కల, డిజిటల్‌ మాధ్యమాల యాజమా­న్యాల ప్రతినిధులు డిసెంబ‌ర్ 28‌ సాయంత్రంలోగా తమ వివరాలను 91541 04393 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా పంపాలని విజ్ఞప్తి చేశారు. 

#Tags