Govt Aided Schools: ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లకూ బయోమెట్రిక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్ల ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.
పాఠశాలలకు గైర్హాజరవుతుండడంతోపాటు కొంతమంది సకాలంలో రావడం లేదు. విధుల్లో కూడా సరిగా వ్యవహరించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. ఎయిడెడ్ స్కూళ్ల సిబ్బంది అందరికీ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు ఆర్జేడీలకు ఉత్తర్వులిచ్చారు.
#Tags