Skip to main content

School Admissions: పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయంలోని శ్రీభద్రకాళి సాంగ ఆగమ సంస్కృత వేద పాఠశాలలో వైదిక స్మార్త ఆగమం, తైత్తరీయ కృష్ణయజుర్వేదాధ్యయనంలో ప్రవేశం పొందాలనుకునే ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని భద్రకాళి దేవాలయ కార్యనిర్వహణాధికారి, అసిస్టెంట్‌ కమిషనర్‌ శేషుభారతి జూలై 12న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Invitation of applications for admission to Vedic School  Vedic Smarta Agama students studying at Sribhadrakali Sanga Sanskrit Vedic School  Taittariya Krishnayajurvedadhyayana students at Bhadrakali Temple  Bhadrakali Temple announcement on Vedic education  Cultural education opportunities at Bhadrakali Temple

8 నుంచి 12 ఏళ్ల వయస్సు కలిగి మాతృభాషలో చదవడం, రాయడం, ఉప నయన సంస్కా రం, ఉపాకర్నోత్సర్జనములు పూర్తి అయినవారు, సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞాలు కంఠస్థం వచ్చిన విద్యార్థులు పాఠశాలలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. జూలై 13 నుంచి వేద పాఠశాలలో దరఖాస్తు ఫారాలు ఇస్తామని, పూరించిన దరఖాస్తులను జూలై 22వ తేదీ వరకు వేద పాఠశాల కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

చదవండి: Auto Driver Impressive English Speaking Skills: ఇంగ్లీష్‌లో అదరగొట్టిన ఆటోవాలా.. వీడియో వైరల్‌

Published date : 13 Jul 2024 03:42PM

Photo Stories