Department of Education: బడిబయట టీచర్లపై ఆరా..!

మంచిర్యాల అర్బన్‌: సర్కారు పాఠశాలల్లో పాఠాలు బోధించకుండా బోధనేతర కార్యక్రమాలకే పరిమితమైన టీచర్లపై విద్యాశాఖ దృష్టి సారించింది.

ఏళ్ల తరబడి డిప్యూటేషన్‌ పేరిట ఆయా విధుల్లో మునిగి తేలుతున్న వారిపై ఆరా తీసింది. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో సమన్వయకర్తలు, టాస్‌, ఇతర విధుల్లో దీర్ఘకాలిక డిప్యూటేషన్‌పై పని చేస్తున్న వారి వివరాలు సమర్పించాలని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డీఈవోలను ఆదేశించింది. ఏఎస్‌వో, డీసీఈబీలో అసిస్టెంట్‌ సెక్రెటరీ, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఎంఆర్సీలో పనిచేస్తున్న టీచర్ల ఎంతమంది ఉన్నారు..? ఏన్నాళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారనే సమాచారం సేకరణలో నిమగ్నమైంది.

నిబంధనలకు విరుద్ధంగా..

జిల్లాల పునర్వవిభజనలో భాగంగా ఉద్యోగులు, సిబ్బంది కొరతతో విద్యాశాఖ కార్యాలయంలో ఆయా విభాగాల్లో టీచర్లను సర్దుబాటు చేశారు. ఇదే అదునుగా భావించిన కొందరు కాలపరిమితి ముగిసినా ఏళ్ల తరబడి కార్యాలయాల విధుల్లోనే పాతుకుపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏపీవోగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్జీటీ ఫారిన్‌ సర్వీస్‌లో కొనసాగుతున్నాడు. నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత పాఠశాలకు వెళ్లాల్సి ఉంది. 

చదవండి: HMs Suspended: 11 మంది హెచ్‌ఎంల సస్పెన్షన్‌.. కార‌ణం..

ఇటీవల ప్రమోషన్‌ వచ్చినా తిరస్కరించడం.. పాఠశాలకు వెళ్లకుండా అదే పోస్టులో కొనసాగడంపై ఉపాధ్యాయ సంఘాలు తప్పు పడుతున్నాయి. జిల్లా సైన్స్‌ కార్యక్రమాల నిర్వహణకు ప్రధానోపాధ్యాయుడు, స్కూల్‌ అసిస్టెంట్‌ బయైసెన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ను జిల్లా సైన్స్‌ అధికారిగా నియమిస్తారు. ఇందులో భాగంగా నూతన జిల్లా ఏర్పడిప్పటి నుంచి ఓ సైన్స్‌ టీచర్‌కు డీఎస్‌వోగా విధులు కేటాయించారు.

సైన్స్‌ కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో మినహా మిగతా సమయమంతా పాఠశాలలో పాఠాలు బోధించాల్సి ఉంటుంది. మారుమూల ప్రాంతమైన ఓ పాఠశాలలో విధులు నిర్వర్తించే ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ను డీఎస్‌వో పనిచేసే పాఠశాలకు సర్దుబాటు చేశారు. 

నిబంధనలకు విరుద్ధంగా మరో పాఠశాల నుంచి టీచర్‌ను ఎందుకు కేటాయించారో అధికారులకే తెలియాలి. డీఎస్‌వో బాధ్యతల నుంచి తప్పుకుంటూ ఏడాది క్రితం తన పాఠశాలకు వెళ్లేందుకు సముఖత వ్యక్తం చేసినా రిలీవ్‌ చేయకపోవడంపై అప్పట్లో చర్చనీయాంశమైంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

డిస్ట్రిక్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు (డీసీఈబీ) సెక్రెటరీగా జిల్లా కేంద్రమైన గర్మిళ్ల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. సమ్మెటివ్‌ పరీక్షలు(ఎస్‌ఏ) ప్రశ్నపత్రాల తయారీ పర్యవేక్షణ అంతా ఆయన చూడాల్సి ఉంటుంది. పరీక్షల సమయంలో తప్ప మిగతా సమయంలో పాఠశాల విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

కార్యాలయం ఓచోట.. పాఠశాల మరో చోట ఉండడమో ఏమోగానీ రెండు చోట్ల సరైన సమయంలో అందుబాటులో లేకపోతున్నట్లు తెలు స్తోంది. డీసీఈబీ సెక్రెటరీకి సహాయకుడిగా చె న్నూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పోక్కుర్‌లో ఫిజికల్‌ సైన్స్‌ టీ చర్‌కు బాధ్యతలు కేటాయించారు. ప్రస్తుత సహాయకుడిగా విధులు నిర్వహించే టీచర్‌ దూరంగా ఉండడమో ..? ఏమోగానీ పాఠశాలకు వెళ్లి పా ఠాలు చెప్పిన దాఖలాలు తక్కువే. ఇక్కడ కూడా మరో టీచర్‌ను డిప్యూటేషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా పరీక్షల విభాగంలో మాత్రం అవసరమైనప్పుడు మాత్రమే ఓ టీచర్‌ను కేటాయిస్తుండగా మిగిలిన టీచర్ల విషయంలో ఉదాసీనత ఎందుకో అధికారులకే తెలియాలి.

బోధనకు ఆటంకం కలుగకుండా

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే కులగణన సర్వేలో విద్యార్థుల చదువులు నష్టపోకుండా, బోధనకు ఆటంకం కలుగకూడదనే ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చింది. జిల్లాలో మాత్రం బడుల్లో వేతనం పొందుతూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం పేరిట పాఠాలు బోధించకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

ఇదివరకు డీఈవో కార్యాలయంలో సెక్టోరల్‌ అధికారులుగా ఫారిన్‌ సర్వీసులో విధులు నిర్వర్తించే వారంతా గడువు ముగియగానే వెనక్కి వెళ్లగా మరికొందరు టీచర్లు అదే పోస్టులో తిష్ట వేయడంపై చర్చ సాగుతోంది. ఇలాంటి టీచర్లు ఎంత మంది ఉన్నారు..? ఏమేర చర్యలుంటాయో వేచి చూడాలి.

నిబంధనల మేరకు విధులు..

జిల్లా విద్యాశాఖ కార్యాలయ పరిధిలో విధులు నిర్వర్తించే టీచర్లంతా ఉన్నతాధికారుల ఆదేశానుసారం కొనసాగుతున్నారు. పాఠశాల విద్య ప్రాంతీయ డైరెక్టర్‌ నుంచి అనధికారికంగా ఇతర విధులు(బోధనేతర) నిర్వర్తించే టీచర్ల వివరాలు సమర్పించాలని ఆదేశాలు వచ్చింది వాస్తవమే. నిబంధనలు విరుద్ధంగా టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. 
– డీఈవో యాదయ్య
 

#Tags