RGUKT (IIIT) Basara: సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు.. నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తులు ఇలా..
ఈ ఏడాది 1,404 జనరల్ సీట్లు, 96 ప్రత్యేక సీట్లు, 105 గ్లోబల్ సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 1,605 సీట్లకుగాను కేవలం 13,538 దరఖాస్తులు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ తెలిపారు. జూలై 3న మెరిట్‌జాబితాను విడుదలచేసి ఎంపికైన విద్యార్థులకు జూలై 7 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
చదవండి: బాసర ఆర్జీయూకేటీ డైరెక్టర్‌కు పేటెంట్
తగ్గిన దరఖాస్తులు: నాలుగేళ్లుగా 20 వేలకుపైగానే ట్రిపుల్‌ఐటీలో దరఖాస్తులు రాగా, ఈ ఏడాది సగానికి తగ్గిపోయాయి. బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు కోసం వేలాదిమంది పోటీపడేవారు. ప్రారంభం నుంచే ఇక్కడ తీవ్రమైన పోటీ ఉండేది. ఈ ఏడాది అనుకోని విధంగా దరఖాస్తులు తగ్గిపోయాయి.
చదవండి: IIIT Basara: సమస్యలు పరిష్కరిస్తాం
వరుస ఘటనలే కారణమా..
రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ దర ఖాస్తుల నోటిఫికేషన్ వెలు వడిన సమయంలోనే ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఇక్కడ చదివించేందుకు అంతగా ఆసక్తి కనబరచడంలేదు. నిబంధనలపేరిట ట్రిపుల్‌ఐటీని రహస్య క్యాంపస్‌గా తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తులు
సంవత్సరం |
దరఖాస్తుల సంఖ్య |
2020–21 |
20,178 |
2021–22 |
20,195 |
2022–23 |
32,800 |
2023–24 |
13,538 |
పరిశీలన వేగవంతం
బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల చదువు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతంచేసేందుకు 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తికానుంది.
– ప్రొఫెసర్ వెంకటరమణ, ఇన్‌చార్జి వీసీ