బాసర ఆర్జీయూకేటీ డైరెక్టర్‌కు పేటెంట్
Sakshi Education
భైంసా: విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులను నివారించి నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు వీలు కల్పించే సాంకేతికతపై బాసర ఆర్జీయూకేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ పేటెంట్ (ప్రత్యేక హక్కు) సాధించారు.
‘నోవెల్ ఇంటర్‌లైన్ యూనిఫైడ్ పవర్ క్వాలిటీ కండిషనర్ మల్టీఫీడర్ సిస్టం విత్ ఫోర్ కన్వర్టర్స్’టెక్నాలజీపై మూడేళ్లుగా చేసిన పరిశోధన కృషికిగాను ఈ పేటెంట్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ పేటెంట్ కాలవ్యవధి 20 ఏళ్లపాటు ఉంటుందని చెప్పారు.
చదవండి: IIIT Basara: ప్రముఖ విద్యాసంస్థలతో ట్రిపుల్ ఐటీ ఎంవోయూ
పలు జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు ఈ పేటెంట్ హక్కుదారుల నుంచి అనుమతి పొంది నాణ్యమైన విద్యుత్, చౌక విద్యుత్‌ను వినియోగదారులకు అందించే వీలుంటుందని వివరించారు. విద్యుత్ సంస్థలకు సంబంధించి పలు సంస్కరణలకు ఇందులో పరిష్కారమార్గాలు చూపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘనత సాధించినందుకు వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు మార్చి 28న ప్రొఫెసర్ సతీశ్‌కుమార్‌ను సన్మానించారు.
Published date : 29 Mar 2023 01:21PM