IIIT Basara: ప్రముఖ విద్యాసంస్థలతో ట్రిపుల్ ఐటీ ఎంవోయూ
Sakshi Education
బాసర (ముథోల్): రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఐఐటీ గచ్చిబౌలి, ఫారెస్ట్ కాలేజ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌తో బాసర ట్రిపుల్ ఐటీ ఎంవోయూ చేసుకున్నట్లు ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు.
హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఈమేరకు ఒప్పంద పత్రాలపై డిసెంబర్ 16న సంతకాలు చేసినట్లు వెల్లడించారు. పరస్పర సహకారంతో విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
చదవండి: ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బ్లాక్ చైన్ టెక్నాలజీపై శిక్షణ
ఒప్పందం కుదుర్చుకున్న కళాశాలల వీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బాసర ట్రిపుల్ ఐటీతో చేసుకున్న ఎంవోయూ మేరకు తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో గ్రీన్‌హబ్ ఏర్పాటు చేస్తామని డీన్ ప్రియాంక వర్గీస్ తెలిపారు. దీనిద్వారా అటవీ ఉత్పత్తులు, అటవీ సంపద పెంపు, మొక్కల పెంపకం తదితర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు.
చదవండి: IIIT: ఇంటర్ తరహా పరీక్షలు
Published date : 17 Dec 2022 02:40PM