Skip to main content

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీపై శిక్షణ

నూజివీడు: తమ విద్యార్థుల్లో సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌ను పెంపొందించడమే లక్ష్యంగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ముందడుగు వేస్తోంది.
Training on block chain technology for IIIT students
సంతకాలు చేస్తున్న ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, కంపెనీ సీఈవో ఓబుళపతి

ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన స్ట్రాహ్యాట్‌ ప్రైవేటు కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఆచార్య జి.వి.ఆర్‌.శ్రీనివాసరావు, స్ట్రాహ్యాట్‌ కంపెనీ సీఈవో చల్లా ఓబుళపతి ఒప్పంద పత్రాలపై డిసెంబర్‌ 9న సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా కంపెనీ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీకి సంబంధించిన అప్లికేష న్‌లపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది.

చదవండి: జేఈఈపై విద్యార్థుల్లో తగ్గుతున్న ఆసక్తి.. కారణాలు ఇవే..

ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులు దీనికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ అయిన విద్యార్థులందరికీ మూడు నెలల పాటు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీపై శిక్షణ అందిస్తారు. అంతేగాక బ్లాక్‌చైన్‌ రంగం లో అవకాశాలపై అవగాహన పెంచేందుకు కంపెనీ శిక్షణ సమయంలో విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, హ్యాక్‌థాన్‌లు నిర్వహి­స్తారు. శిక్షణ అనంతరం 25 మంది విద్యా­ర్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. ఏడాది పాటు ఉండే ఇంటర్న్‌షిప్‌ కాలంలో నెలకు రూ.25 వేల స్టైఫండ్‌ను అందజేస్తారు. ఆ తర్వాత వారికి పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులైనవారికి ఏడా­దికి రూ.12 లక్షల ప్యాకేజీతో కంపెనీలో ప్లేస్‌మెంట్‌ ఇవ్వడం జరుగుతుంది. 

చదవండి: IIIT: 30 మంది ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు

Published date : 10 Dec 2022 04:19PM

Photo Stories