OU Distance Education: డిస్టెన్స్‌ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: దూరవిద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 5వ తేదీ వరకూ, రూ.500 ఆలస్య రుసుంతో 8వ తేదీ వరకూ దరఖాస్తులు పంపుకోవచ్చని టీజీసీపీగెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.జలపతి ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రవేశ పరీక్ష నవంబర్‌ 9న జరగనుందని తెలిపారు. వివరాలకు  www.ouadmissions.com వెబ్‌సైట్‌కు లింక్‌ కావాలని సూచించారు.  

చదవండి: Distance Education: దూరవిద్య ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags