Admissions: ‘NIT’లో పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీనిట్‌)లో 2024–25 జూన్‌ సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ ఫుల్‌టైం, పార్ట్‌టైం ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులకు (రెండు విభాగాలను అనుసంధానిస్తూ) అర్హులైన అభ్య­ర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు­న్నట్టు డీన్‌ అకడమిక్‌ డాక్టర్‌ టి.కురుమయ్య మే 22న‌ తెలిపారు.

ఫుల్‌టైం కోర్సులకు మాస్టర్స్‌ డిగ్రీతో పాటు గేట్‌ పరీక్షలో విధిగా అర్హత సాధించాలన్నారు. పార్ట్‌టైం అభ్యర్థులు మాస్టర్‌ డిగ్రీతోపాటు ఏదైనా అకడమిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో లేదా పరిశ్రమలో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు మే 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి: NO Admissions in IIHT: ఐఐహెచ్‌టీలో ఈ ఏడాది అడ్మిషన్లు లేనట్లే!.. కార‌ణం ఇదే..

రాత పరీక్ష, ముఖాముఖి పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు నిట్‌ వెబ్‌సైట్‌ లేదా నిట్‌ అడ్మిషన్ల అధికారి డాక్టర్‌ తపస్‌ను సంప్రదించాలని కోరారు.

#Tags