AP Open School Admission 2023: ఓపెన్ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
అనకాపల్లిటౌన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్)లో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నట్టు డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరానికి గాను ఆగస్టు 31వతేదీ లోపు ఎటువంటి అపరాధ రుసం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకుని దగ్గరలో గల ఓపెన్ స్కూల్ సెంటర్‌కు వెళ్లి ఒరిజనల్ సర్టిఫికెట్‌లు సమర్పించి ఫీజు చెల్లించి ప్రవేశం పొందాలన్నారు.
#Tags