New Certificate Course: హెచ్‌సీయూలో మరో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హెచ్‌సీయూ–ఫెర్నాండెజ్ ఫౌండేషన్ బర్త్ కేర్ ప్రాక్టీషనర్–బర్త్ డౌలా సర్టిఫికెట్ కోర్సును జూలై 4న ప్రారంభించారు.
ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో, తర్వాత తల్లులకు మద్దతివ్వడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానంతో ఔత్సాహిక బర్త్ ప్రొఫెషనల్స్‌ను సన్నద్ధం చేయడానికి ఈ వైద్యేతర కోర్సును రూపొందించారు. ఆరు నెలల కాలపరిమితితో కూడిన ఆన్‌లైన్ శిక్షణ ఉంటుంది.
చదవండి: Akhil Kumar: హెచ్‌సీయూ విద్యార్థికి రాజనీతిశాస్త్రంలో డాక్టరేట్
అడ్మిషన్ నుంచి రెండేళ్లలో పూర్తి చేయాలి. కోర్సు సమయంలో అభ్యర్థులు ప్రినేటల్ యోగా, ప్రసవ విద్య, చనుబాలివ్వడం, కౌన్సెలింగ్ మొదలైన అదనపు సహాయ సేవలను అందించేందుకు శిక్షణ పొందుతారు. దంపతులకు గర్భం, ప్రసవం, ప్రసవానంతర సేవలను అందించేలా ఈ కోర్సును రూపొందించారు.
చదవండి: Narendra Modi: హెచ్‌సీయూకు ‘5జీ యూజ్ కేస్ ల్యాబ్’ కేటాయింపు
#Tags