10th Class Marks Memo: ‘నన్ను పాస్‌ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’ తండ్రి మార్కుల షీట్‌ను పోస్ట్‌ చేసిన కొడుకు

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరి రహస్యాలూ దాగడం లేదు. ఓ కుర్రాడు తన తండ్రికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కుర్రాడు తండ్రి భద్రంగా దాచుకున్న అతని 10వ తరగతి మార్కు షీట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇందులో అన్ని సబ్జెక్టుల్లో తండ్రి ఫెయిల్ అయ్యాడు. ఆ మార్క్ షీట్ ఫోటోకు క్యాప్షన్‌గా ‘తన తండ్రి మార్క్ షీట్ దొరికింది’ రాశాడు.

ఆ కుర్రాడు వీడియోలో ‘మా నాన్న నాతో తరచూ పాస్‌  కావాలని చెబుతుంటారని, అయితే ఇప్పుడు చూడండి మా నాన్న మార్క్స్‌షీట్‌.. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఈ వీడియోను చూసినవారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

After Inter MPC Best Courses & Job Opportunities : ఇంటర్‌ 'MPC' పూరైన త‌ర్వాత బెస్ట్ కోర్సులు- ఉద్యోగాలు ఇవే..!

ఈ మార్క్‌షీట్‌ను  @desi_bhayo88 పేరిట సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎ‍క్స్‌’లో షేర్‌ చేశారు. ఈ పోస్టును ఇప్పటివరకూ ఐదు లక్షల మంది చూడగా, ఐదు వేల మంది లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై పలువురు కామెంట్లు కూడా చేశారు. ఒక యూజర్‌  ఇప్పటితో పోల్చిచూస్తే సీబీఎస్‌ఈ బోర్డులో తండ్రి ఫెయిల్ అయిన మార్కులు 90 శాతానికి సమానం అని రాశారు. మరొకరు ఫెయిల్‌ అయితే ఏమవుతుందో తెలుసు కనుకనే పాస్‌ కావాలని చెప్పారని రాశారు. 

 

#Tags