BRAOU: ఓపెన్ వర్సిటీ పరీక్షలకు ఈ లోపు ఫీజు చెల్లించాలి
సనత్‌నగర్: బ్యాక్‌లాగ్ విద్యార్థుల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షా ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు నవంబర్ 18న తుది గడువు అని బేగంపేటలోని మహిళా డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ వర్శిటీ సెంటర్ కో–ఆర్డినేటర్ మారోజు రామాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
2016, అంతకముందు బ్యాచ్‌లకు చెందిన బీఏ, బీకామ్, బీఎస్సీ బ్యాగ్‌లాగ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చదవండి: BRAOU: డిగ్రీ బీఓఎస్, ఐటీఈపీ డిగ్రీ కరిక్యులమ్ డిజైన్‌పై సమీక్ష
మొదటి సంవత్సరం విద్యార్ధులకు డిసెంబర్ 9 నుంచి 12 వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు డిసెంబర్ 9 నుంచి 14 వరకు, తృతీయ సంవత్సరం విద్యార్ధులకు డిసెంబర్ 16 నుంచి 21 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
#Tags