Acharya NG Ranga Agricultural University: ఫుడ్‌ టెక్నాలజీతో అపార అవకాశాలు

పులివెందుల టౌన్‌ : ఫుడ్‌ టెక్నాలజీతో అపార అవకాశాలు ఉన్నాయని పులివెందుల ఫుడ్‌ సైన్స్‌అండ్‌ టెక్నాలజీ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.సర్దార్‌ బేగ్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఫుడ్‌ సైన్స్‌, టెక్నాలజీ కళాశాల అసోసియేట్‌ డీన్‌ ఎస్‌.సర్దార్‌ బేగ్‌

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు అప్లికేషన్స్‌ ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారా ఈనెల 31వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. అడ్మిషన్లకు సంబంధించిన అప్లికేషన్‌ను వ్యవసాయ విశ్వ విద్యాలయ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఏపీ – ఈఏపీసీ ఈటీలో ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులు తమ కళాశాలకు వెబ్‌ ఆప్సన్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు అభ్యసించిన వారికి ఆహార అనుబంధ రంగాలలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు.

Also read: Nursing Job : నర్సింగ్‌ ట్యూటర్స్‌గా ప్రమోషన్లు

దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈకోర్సు అభ్యసించిన విద్యార్థులకు మెండుగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఎక్కువ జీతంతోపాటు సుస్థిరమైన జీవితం లభిస్తుందన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ప్రొడక్షన్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్లు, ప్రభుత్వ రంగంలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు, పేటెంట్‌ ఆఫీసర్లు, ఇతర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలలో అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా సొంతంగా పరిశ్రమలు ప్రారంభించవచ్చునన్నారు. విద్య పూర్తయ్యాక దేశ, విదేశాలలో ఎందరో తమ కళాశాల విద్యార్థులు అధ్యాపకులుగా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలలో వివిధ శాఖలలో స్థిరపడుతున్నారన్నారు. పులివెందుల ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో బీటెక్‌ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అందుబాటులో ఉందన్నారు.

Also read: Enquiry Committee: విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ కమిటీ..కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

ఇంటర్‌, టెన్త్‌ ప్లస్‌ టు పూర్తి చేసిన ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఏపీ ఈఏపీసీ ఈటీలో పొందిన ర్యాంక్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఏపీ– ఈఏపీసీ ఈటీలో ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులు తమ కళాశాలను వెబ్‌ ఆప్షన్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలన్నారు. తమ కళాశాలలో పూర్తి స్థాయిలో ఆధునిక ప్రయోగశాలలు ఉన్నాయన్నారు. కళాశాలలో విద్యను పూర్తి చేసిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో ఫెలోషిప్‌లకు ఎంపికయ్యారన్నారు.

Also read: Employees: నైపుణ్యాభివృద్ధిలో హెచ్‌ఆర్‌ కీలకం

#Tags