IAS Officer Success Story : ఈ కసితోనే.. ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఐఏఎస్ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..
ఈమె ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన దీక్షిత జోషి. దీక్షిత జోషి యూపీఎస్సీ(UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022లో 58వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో దీక్షిత జోషి సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
దీక్షిత జోషి.. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన వారు. దీక్షిత తండ్రి ఫార్మసిస్ట్. ఆమె తల్లి ఇంటర్ కాలేజీలో హిందీ లెక్చరర్.
ఎడ్యుకేషన్ :
దీక్షిత జోషి.. ఆర్యమాన్ విక్రమ్ బిర్లా స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత జిబి పంత్ విశ్వవిద్యాలయం పంత్‌నగర్ నుంచి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. అలాగే
దీక్షితా.. ఐఐటీ మండి నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. మాస్టర్స్ చేస్తున్న సమయంలో దీక్షిత UPSC పరీక్షలను రాయాలని నిర్ణయించుకున్నారు.
ఎలాంటి కోచింగ్ లేకుండానే..
దీక్షిత.. మాస్టర్స్ చేస్తున్న సమయంలోనే యూపీఎస్సీ(UPSC) సివిల్స్ పరీక్షలను రాయాలని నిర్ణయించుకున్నారు. అయితే యూపీఎస్సీ(UPSC) కోసం ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. 2022లో యూపీఎస్సీ(UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలో 58 ర్యాంక్ సాధించి.. దీక్షితా జోషి IAS అధికారిగా ఎంపికయ్యారు.
వాస్తవానికి యూపీఎస్సీ(UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పోటీ పరీక్ష కోసం అనేక మంది ఎంతో కష్టపడతారు. సివిల్స్ రాయాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలో విజయం సాధించడానికి సంవత్సరాలు పడుతుంది. సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ ఉంటే.. ఈ పరీక్షలో విజయం సాధించడం ఈజీనే అంటున్నారు దీక్షిత.
☛ ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
పుస్తకాల నుంచి..
ఓటమికి ఎప్పుడూ భయపడకూడదని అన్నారు. యూపీఎస్సీ(UPSC) ఛేదించడానికి ఏకాగ్రతను మిస్ కావద్దు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల నుంచి నోట్స్ సిద్ధం చేసుకోండి.