IAS Officer Success Story : టీ కొట్టు న‌డుపుతూ.. ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యానిలా.. కానీ సొంత అన్న అకాల‌ మరణంతో...!

ఇటీవ‌ల కాలంలో ఎంద‌రో పేదిండి బిడ్డ‌లు.. యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే సివిల్స్ లాంటి అత్యంత క‌ఠిమైన ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించి ఐఏఎస్‌, ఐపీఎస్ ఆఫీస‌ర్ లాంటి ఉన్న‌త ఉద్యోగాల‌ను సాధిస్తుంటారు.

అయితే ఈ పెదింటి కుర్రాడు.. గట్టిగా అనుకుంటే ఐఏఎస్‌ అధికారి కూడా అయిపోవచ్చని నిరూపించాడు దేశాల్ దాన్. ఇలా అని ఏం కష్టపడకుండా సింపుల్‌గా యూపీఎస్సీ సివిల్స్‌ క్రాక్ చేసేశాడు అనుకుంటే పొరపాటే. ఒక వైపు అన్నయ్య మరణం, మ‌రో వైపు కోచింగ్‌కి కూడా డబ్బులు లేని స్థితి. ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు సివిల్స్ ప్రిప‌రేష‌న్ అయ్యాడు. ఇత‌ను ఐఏఎస్ ఆఫీస‌ర్ ఎలా అయ్యాడు...? ఇత‌ని కుటుంబ నేప‌థ్యం ఏమిటి..? దేశాల్ దాన్ ఐఏఎస్ స‌క్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం :
దేశాల్ దాన్.. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా సుమలై అనే చిన్న పల్లె. ఆ ఊరికి చెందిన కుశాల్ దాన్ యూనియన్ సర్కిల్‌లో టీ స్టాల్ నిర్వహించేవారు. ఆయనకు అయిదుగురు సంతానం. వచ్చే అంతంత మాత్రం ఆదాయంతోనే పిల్లలను చదివించారు. వారిలో ఇద్దరు కొడుకులు మాత్రం బాగా చదివారు. తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆ కుమారులు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలనుకున్నారు. టీ దుకాణంలో తండ్రికి సాయం చేస్తూనే  వారిలో పెద్ద కుమారుడు నేవీలో ఉద్యోగం సంపాదించారు. 

➤☛ Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

త‌న సొంత అన్న మరణంతో..

అన్న స్ఫూర్తితో ప్రతి తరగతిలో క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటూ చదువు కొనసాగించాడు దేశాల్ దాన్. అయితే నేవీలో పనిచేస్తున్న తన అన్న అనుకోని ప్రమాదంలో మరణించేసరికి దేశాల్ తట్టుకోలేకపోయారు. ఊహించని ఈ సంఘటనతో తీవ్ర నిరాశలోకి వెళ్లపోయిన దేశాల్ చదువు మానేద్దామని అనుకున్నారు. కాని ప్రతి మనిషి ఏదో ఒక పర్పస్ కోసం పుడతాడని నమ్మి దేశాల్ కొన్నాళ్ల తర్వాత మళ్లీ లక్ష్యం దిశగా అడుగులు వెయ్యడం ప్రారంభించారు.

తన పిల్లలు చదువులో రాణించాలని కుశాల్ ఎప్పుడూ కోరుకొనే వారు. అందుకే ఆర్థికంగా కష్టంగా ఉన్నప్పటికీ తండ్రి టీ దుకాణం నడుపుతూ తమను చదివిస్తున్నారన్న విషయం ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకొని దేశాల్ చదువు కొనసాగించారు. స్కూల్ చదువు పూర్తయిన తర్వాత తన తెలివి తేటలతో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ జబల్‌పూర్‌లో ఫ్రీ సీట్ సంపాదించారు. బీటెక్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం ప్రారంభించారు.

దేశాల్ దాస్ తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షలో జాతీయ స్థాయిలో 82వ ర్యాంక్‌ సాధించి అందరినీ ఆశ్యర్య పరిచారు. పేద కుటుంబంలో జన్మించిన దేశాల్ టీ కొట్టులో తండ్రికి సాయం చేస్తూనే చదువుకొని, అన్న అకాల మరణాన్ని తట్టుకొని తన జీవిత లక్ష్యమైన ఇండియన్ అడ్మినిస్ట్రేసన్ సర్వీసెస్(IAS)లో ఉద్యోగం సంపాదించాడు. కేవలం 24 ఏళ్లకే ఇదంతా సాధించగలిగానంటే తన తండ్రి కుశాల్ దాన్ వల్లేనని గర్వంగా చెబుతారు దేశాల్ దాన్. 

➤☛ Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

బాల్యం అంతా టీ కొట్టులోనే..

టీ అమ్మే ఆ తండ్రి ఏ రోజూ అనుకొని ఉండరు తన కొడుకు ఐఏఎస్ (IAS) అధికారి అవుతాడని. ఎందుకంటే ఆ  IAS అధికారి బాల్యం అంతా టీ దుకాణంలోనే ఆడుతూ.. పాడుతూ.. సాగిపోయింది. తన తర్వాత ఆ టీ కొట్టు నడిపిస్తే చాలనుకున్న తన కొడుకు మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్స్‌ని క్రాక్ చేసేసరికి ఆ తండ్రి ఆనందానికి అవధులే లేవు.

➤☛ Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

➤☛ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

#Tags