IPS Success Story : ఇంట్లో చెప్పకుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..
రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించింది. తెలంగాణ కేడర్‌కు వచ్చిన తొలి తెలంగాణ మహిళా ఐపీఎస్‌గా గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాదీ యువతి. ఈమే అపూర్వారావు ఐపీఎస్. ఈ నేపథ్యంలో అపూర్వారావు ఐపీఎస్ సక్సెస్ స్టోరీ మీసం..
కుటుంబ నేపథ్యం :
మాది హైదరారాబాద్‌లోని బేగంబజార్. నాన్న సివిల్ కాంట్రాక్టర్. అమ్మ గృహిణి. నాకు ఓ అక్క. మా అమ్మ సాధారణ గృహిణే. కానీ, విద్యావంతురాలు. చిన్నప్పటి నుంచీ మా చదువుల బాధ్యతంతా తనే చూసుకునేది. మా అక్క కూడా చాలా ప్రోత్సహించేది.
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి
ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.. కానీ నేను మాత్రం..
బీటెక్ తర్వాత, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చింది. మంచి కంపెనీ, మంచి జీతం. మూడేండ్లు అక్కడే పనిచేశాను. కానీ, లక్ష్యాన్ని మరచిపోలేదు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయాను. రెండోసారి మరింత కష్టపడ్డాను. రోజూ ఆఫీస్ నుంచి రాగానే పుస్తకాలు ముందేసుకొనేదాన్ని. వీకెండ్స్ కూడా ప్రిపరేషన్‌కే అంకితం. ఉద్యోగం, చదువు రెండూ చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నా. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సంగతి ఇంట్లో చెప్పలేదు. ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తయి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాతే నాన్నతో చెప్పాను. చాలా సంతోషించారు.
అలా పిలుస్తున్నప్పుడు గర్వంగా ఉంటుంది..
నిబద్ధతతో నేను 2014లో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత ట్రైనింగ్‌కు సంబంధించి మొదట్లో కాస్త కంగారుపడ్డాను. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. నన్ను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. దీంతో మా కొలీగ్స్ తెలంగాణ ఐపీఎస్ అంటుంటారు నన్ను. అలా పిలుస్తున్నప్పుడు గర్వంగా ఉంటుంది. రాష్ట్ర అవతరణ తర్వాత ఐపీఎస్‌కు ఎంపికైన తొలి తెలంగాణ మహిళను నేనే అనుకుంటా! శిక్షణ తర్వాత గోదావరిఖని ఏఎస్పీగా కొన్నాళ్లు పనిచేశాను. సీఐడీ ఎస్పీగా కూడా విధులు నిర్వర్తించాను. తర్వాత వనపర్తి జిల్లాకు ఎస్పీగా కూడా పనిచేశాను. నాటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణతోపాటు, సాధ్యమైనంతలో సామాజిక కార్యక్రమాలూ చేపడుతున్నా.
Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే.. ఐపీఎస్ అయ్యానిలా..
నేను కూడా ఇలా ఉంటే..
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చక్కటి సంపాదనతో విలాసవంతంగా బతకొచ్చు. కానీ, సమాజం కోసం పని చేస్తున్నప్పుడు కలిగే సంతృప్తి ముందు అవన్నీ దిగదుడుపే. మా ఇంట్లో ఐఏఎస్‌లు లేరు. ఐపీఎస్‌లు లేరు. కానీ, చిన్నప్పటి నుంచీ నాకు పోలీస్ కావాలని కోరిక. సినిమాల్లో పోలీసు పాత్రలను చూసినప్పుడల్లా ‘నేను కూడా ఇలా ఉంటే.. ’ అనుకునేదాన్ని.
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
ఏ రంగంలో అయినా..
తగిన ప్రోత్సాహం అందిస్తే అమ్మాయిలు ఏ రంగంలో అయినా రాణిస్తారు. ఆడపిల్లపై వివక్ష తరతరాలుగా వస్తున్నది. కుటుంబాల్లో ఆడపిల్లకు రెండో ప్రాధాన్యం ఇచ్చే రోజులు పోవాలి. వాళ్లకు నచ్చింది చదివే స్వేచ్ఛనివ్వాలి. ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించాలి. బాల్యం నుంచే సామాజిక చైతన్యం కలిగించాలి. అమ్మాయిలు కూడా చిన్నచిన్న విషయాలకు అధైర్యపడొద్దు. ఆత్మన్యూనతకు గురికావద్దు. ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడే క్రీడాకారిణులుగా, విద్యావేత్తలుగా, పరిపాలనా దక్షులుగా, పాలకులుగా ఎంచుకున్న రంగంలో ఘన విజయం సాధిస్తారు.
Success Story: ఈ లెక్కలే.. నన్ను 'ఐఏఎస్' అయ్యేలా చేశాయ్.. ఎలా అంటే..?
ఈమె ఇచ్చిన ప్రోత్సాహాంతో..
ఎస్పీగా శాంతిభద్రతలు కాపాడుతూనే ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారు అపూర్వారావు. ఐటీ నేపథ్యం కావడంతో జిల్లాలో పలు జాబ్ మేళాలు నిర్వహించారు. వాటి ద్వారా.. దాదాపు 240 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగం రావడం విశేషం. అంతేకాదు, పోలీస్ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న వారిని ఎంపిక చేసి, సొంత ఖర్చులతో శిక్షణ ఇప్పించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న 500 మందిలో దాదాపు 200 మంది ఎస్సైలుగా, కానిస్టేబుళ్లుగా కొలువులు సాధించారు. వీరిలో పలువురు మహిళలు కూడా ఉన్నారు. మరోవైపు గ్రామీణ మహిళలకు కారు, ట్రాక్టర్ డ్రైవింగ్‌లో శిక్షణ అందించి, లైసెన్స్‌లు అందజేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థినులకు వివిధ ఆత్మరక్షణ మెళకువలు చెప్పించారు.
Inspirational Story: కూలీ పనులు చేస్తూ చదివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా
నా అభిప్రాయం ఇదే.. కానీ
నేను ఎంతో అభిమానించిన వృత్తి కావడంతో శిక్షణలో ప్రతి రోజూ నూతనోత్సాహంతో నేర్చుకున్నా. ఇది సవాళ్లను ఎదుర్కోగల ధైర్యాన్నివ్వడంతో పాటు పోలీసింగ్‌పై ఎన్నో మెళకువలను నేర్పింది. ఇప్పటి దాకా కేవలం వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకున్న నేరాలను మాత్రమే చూశాం. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు సమాజంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. వెబ్‌సైట్లు ఎలా హాక్ అవుతున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ అకృత్యాలను నివారించేందుకు ఓ కామన్ సాఫ్ట్‌వేర్ ఉండాలన్నది నా అభిప్రాయం. ఆర్‌బీఐ గవర్నర్ రఘురాంరాజన్ వంటి నిపుణులు ఇచ్చిన ప్రత్యేక ప్రసంగాలు మాలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపాయి.
ఓ సారి బాధితుడి ఇంటికి వెళ్లి..
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో బైక్‌పై కుమారిడితో కలిసి బయటకు వచ్చిన వ్యక్తిని చిన్నారి ఎదుటే చితకబాదిన కానిస్టేబుల్ సస్పెండ్ అయిన విషయం తెల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో అప్పట్లో వైరలైంది. ఈ వీడియో మంత్రి కేటీఆర్, ఎస్పీ, డీజీపీ వరకు వెళ్లింది. ఇది చూసిన కేటీఆర్.. ఆ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన జిల్లా ఎస్పీ అపూర్వ రావు.. ఈ ఘటనపై విచారణ చేసి, సంబంధిత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు. అంతేకాక, ఎస్పీ బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాసేపు ఆ బాలుడితో ముచ్చటించారు.
IAS Success Story: మారుమూల పల్లెటూరి యువకుడు.. ఐఏఎస్ కొట్టాడిలా..