Full Stack Developers: ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌... రూ.లక్షల్లో వార్షిక వేతన ప్యాకేజీలు

ఆన్‌లైన్‌ యుగం. డిజిటల్‌ విధానాలు. ఏ సంస్థ చూసినా.. డిజిటల్‌ బాటలో పయనిస్తున్న పరిస్థితి! ప్రస్తుత కరోనా కాలంలో..ఆన్‌లైన్‌ సేవలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఫలితంగా జాబ్‌ మార్కెట్‌లో టెక్‌ నిపుణులకు భారీ డిమాండ్‌ నెలకొంది. ముఖ్యంగా ఫుల్‌స్టాక్‌ డెవలపర్స్‌కు కంపెనీలు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం – గతేడాది కాలంలో ఫుల్‌ స్టాక్‌ డెవలపర్స్‌కు డిమాండ్‌ రెట్టింపైంది. ఈ నేపథ్యంలో.. అసలు ఫుల్‌ స్టాక్‌ డెవలపర్స్‌ ఏం చేస్తారు.. ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌కు అవసరమైన స్కిల్స్, అర్హతలు, జాబ్‌ ప్రొఫైల్స్, అందుబాటులో ఉన్న శిక్షణ మార్గాలపై సమగ్ర కథనం..
Full Stack Developers
  • డిజిటల్‌ యుగంలో హాట్‌ జాబ్‌ ప్రొఫైల్‌
  •  నిపుణుల కోసం కంపెనీల అన్వేషణ
  •  రూ.లక్షల్లో వార్షిక వేతన ప్యాకేజీలు
  • నిత్యావసరాలు మొదలు హైఎండ్‌ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్‌ వరకూ.. వేటిని కొనుగోలు చేయాలన్నా.. ఆన్‌లైన్‌ షాపింగ్‌..
  • అరచేతిలోని స్మార్ట్‌ ఫోన్‌తో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌ను ఓపెన్‌ చేయడం, తమకు అవసరమైన ప్రొడక్ట్స్‌ ఆర్డర్‌ చేయడం సర్వసాధారణం..
  • ఇలాంటి పరిస్థితుల్లో ఈకామర్స్‌ సంస్థలు, ఆన్‌లైన్‌ షా పింగ్‌ పోర్టల్స్‌.. తమ వెబ్‌పోర్టల్స్‌ ఆకర్షణీయంగా కని పించేలా చర్యలు తీసుకుంటున్నాయి. దాంతోపాటు వినియోగదారులు అన్వేషించే ప్రొడక్ట్స్‌ సమాచారం అత్యంత వేగంగా, సులభంగా ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచ్చే లా వెబ్‌సైట్‌లను రూపొందిస్తున్నాయి. ఇలాంటి యూజర్‌ ఫ్రెండ్లీ వెబ్‌సైట్స్‌ను డెవలప్‌ చేయడంతోపాటు.. బ్యాక్‌ ఎండ్‌లో సర్వర్‌ సైడ్‌లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే నిపుణులే.. ఫుల్‌స్టాక్‌ డెవలపర్స్‌!!
     

ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌.. ముఖ్యాంశాలు

  • టాప్‌–10 డిమాండింగ్‌ జాబ్స్‌లో ఒకటిగా ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌. 
  • లింక్డ్‌ ఇన్‌ ఎమర్జింగ్‌ జాబ్స్‌ రిపోర్ట్‌ ప్రకారం– 2020లో 35 శాతం పెరిగిన నియామకాలు.
  • ప్రపంచ వ్యాప్తంగా 2023 నాటికి 4.7 మిలియన్ల ఉద్యోగాలు.
  • ఎంట్రీ లెవల్‌లోనే నెలకు రూ.50వేలకు పైగా సగటు వేతనం.
  • ప్రధాన ఉపాధి వేదికలుగా ఐటీ, ఈ–కామర్స్‌ సంస్థలు.
  • ప్రోగ్రామింగ్, కోడింగ్‌ స్కిల్స్‌తో రాణించే అవకాశం.


ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌
నేటి డిజిటల్‌ యుగంలో.. ఈ కామర్స్‌ ప్రపంచంలో.. వెబ్‌ పోర్టల్స్‌ను ఆకట్టుకునేలా డిజైన్‌ చేయడం.. యూజర్‌ ఫ్రెండ్లీ వెబ్‌ అప్లికేషన్స్‌ను రూపొందించడం తప్పనిసరిగా మారింది. దాంతోపాటు కస్టమర్లకు వస్తు సేవలు అందించే క్రమంలో.. బ్యాక్‌ ఎండ్‌లో సర్వర్‌ సైడ్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా.. సాఫీగా జరిగేలా చూడటం ఎంతో కీలకం. ఇలాం టి ముఖ్యమైన విధులు నిర్వర్తించే వారే.. ఫుల్‌ స్టాక్‌ డెవల పర్స్‌. ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ అనేది ఇప్పుడు అత్యంత డిమాండింగ్, హాట్‌ జాబ్‌ ప్రొఫైల్‌. సంబంధిత నైపుణ్యాలు ఉంటే సగటున నెలకు రూ.50వేల వేతనం లభిస్తోంది. 


ఫ్రంట్‌ ఎండ్‌
మనం ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్స్‌లో ఏదైనా ఒక స్మార్ట్‌ఫోన్‌ గురించి సెర్చ్‌ చేస్తే.. అలాంటి ఫీచర్సే ఉన్న ఇతర ఫోన్ల వివరాలు కూడా మనకు కనిపిస్తాయి. వాటికి సంబంధించి టెక్నికల్‌ స్పెసిఫికేషన్స్, కలర్, సైజ్‌.. ఇలా అన్నింటినీ చూసేం దుకు వీలుగా నేవిగేషన్‌ విధానం అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు అత్యంత అనువైన విధానంలో.. వారు కోరు కునే వస్తు సేవల వివరాలను తెలియజేసేలా వెబ్‌సైట్‌ను రూపొందించడాన్ని ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌గా పిలుస్తారు. ఇలా అత్యంత యూజర్‌ ఫ్రెండ్లీగా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దే  నిపుణులను.. ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్స్‌ అంటారు.

బ్యాక్‌ ఎండ్‌ 
మనం స్విగ్గీ లేదా జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో.. ఏదైనా ఫుడ్‌ ఆర్డర్‌ చేయగానే.. మన ఆర్డర్‌ వివరాలు డెలివరీ అసిస్టెంట్‌కు నేరుగా వెళ్లడమే కాకుండా.. మనకు ఫుడ్‌ డెలివరీ చేసే సదరు రైడర్‌ వివరాలు, ఫోన్‌ నెంబర్స్‌తో సహా మెసేజ్‌లు కూడా వస్తాయి. అంతేకాకుండా ఎంత సమయంలో మనకు సదరు ఫుడ్‌ డెలివరీ అవు తుందనే విషయం కూడా అప్‌డేట్‌ అవుతుంది. మనం ఒక ఆర్డర్‌ పెట్టగానే.. దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా నిర్వహించే సాంకేతికతే బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్స్‌ను రూపొందించే వారే బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్స్‌.


సమన్వయంతో సాగితేనే
ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్, బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌.. ఈ రెండు విభాగాలను సమన్వయం చేసుకుంటూ.. సాగితేనే ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలరు. వీరు క్లయింట్‌ సైడ్‌లో ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్స్‌తో.. సర్వర్‌ సైడ్‌లో బ్యాంక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. 


హాట్‌ జాబ్‌

  • ప్రస్తుతం దాదాపు అన్ని రంగాలు ఆన్‌లైన్‌ బాట పట్ట డంతో ఫుల్‌స్టాక్‌ డెవలపర్స్‌కు.. మంచి డిమాండ్‌ నెలకొంది.
  • స్టార్టప్‌ సంస్థలు మొదలు బహుళ జాతి కంపె నీల వరకూ.. ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలుంటే ఆకర్షణీయ వేతనాలు అందిస్తున్నాయి.
  • పలు స్టాఫింగ్‌ సంస్థలు, రిక్రూట్‌మెంట్‌ సర్వేల ప్రకారం– ఈ ఏడాది టాప్‌–10 జాబ్‌ ప్రొఫైల్స్‌లో ఒకటిగా ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ నిలుస్తోంది. రానున్న రోజుల్లోనూ వీరికి డిమాండ్‌ కొనసాగుతుందని సదరు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
  • లింక్డ్‌ ఇన్‌ ఎమర్జింగ్‌ జాబ్స్‌ రిపోర్ట్‌ ప్రకారం–గత ఏడాది నియామకాల పరంగా ఫుల్‌ స్టాక్‌ డెవలపర్స్‌కు 35 శాతం పెరుగుదల నమోదైంది.
  • కేంబ్రిడ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అంచనాల ప్రకారం–భారత్‌లో టాప్‌–8 జాబ్‌ ప్రొఫైల్స్‌లో ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2023 నాటికి 4.7 మిలియన్ల ఉద్యోగాలు ఈ విభాగంలో లభిస్తాయని.. అందులో 25శాతం నుంచి 30శాతం భారత్‌లోనే ఉంటాయని అంచనా వేస్తున్నారు.
  • గ్లాస్‌డోర్, మాన్‌స్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ సర్వే, నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ తదితర రిక్రూటింగ్‌ ప్లాట్‌ ఫార్మ్స్‌ సర్వేల గణాంకాలు కూడా.. ఫుల్‌స్టాక్‌ డెవలపర్స్‌కు డిమాండ్‌ రెట్టింపు అవుతుందని స్పష్టం చేస్తున్నాయి.


ఈ నైపుణ్యాలుంటేనే

  • ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌గా కెరీర్‌ ప్రారంభించాలంటే.. అందుకు అవసరమైన నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. నిర్దిష్టంగా ఒక అప్లికేషన్‌కు ప్రోగ్రామింగ్, డిజైన్, డేటా బేసెస్, డీబగ్గింగ్‌ వంటి నైపుణ్యాలు, యూజర్‌ ఎక్స్‌పీరి యెన్స్, బిజినెస్‌ లాజిక్, అప్లికేషన్‌ లుక్, ఫంక్షనింగ్‌ విషయాల్లో నైపుణ్యం సాధించాలి. 
  • వెబ్‌ అప్లికేషన్స్, ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన బేసిక్‌ టూల్స్‌పై అవగాహన తప్పనిసరి. దీంతోపాటు ఆపరే టింగ్‌ సిస్టమ్, వెబ్‌ బ్రౌజర్, టెక్స్‌ట్‌ ఎడిటర్, ఫ్రంట్‌ ఎం డ్, బ్యాక్‌ ఎండ్‌ టూల్స్, ప్యాకేజ్‌ మేనేజర్స్, డేటా బేసెస్‌పై పరిపూర్ణ అవగాహన ఉండాలి. 
  • ఫ్రంట్‌ ఎండ్‌ కోసం హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్, యాంగ్యులర్‌.జేఎస్, పైథాన్‌ నైపు ణ్యాలు అవసరం.
  • బ్యాక్‌ ఎండ్‌కు సంబంధించి జావా, పైథాన్, నోడ్‌జేఎస్, ఎస్‌క్యూఎల్, డిజాంగో లాంటి లాంగ్వేజెస్‌పై పట్టు సాధించాలి. 
  • అదే విధంగా డేటాబేస్‌ నిక్షిప్తం చేసే నైపుణ్యాలైన ఒరాకిల్, రెడిస్, ఎస్‌క్యూఎల్‌  వంటి స్కిల్స్‌ అవసరమవుతాయి.
  • ఇలాంటి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే ఫ్రంట్‌ ఎండ్, బ్యాక్‌ ఎండ్‌ విభాగాలను సమన్వయం చేసుకుంటూ.. పూర్తి స్థాయిలో ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌గా రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. 


టాప్‌ ఐటీ సంస్థలు
ఫుల్‌ స్టాక్‌ డెవలపర్స్‌కు ఆన్‌లైన్, ఈ–కామర్స్‌ సంస్థలే కాకుండా.. ఐటీ సంస్థలు కూడా ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. గూగుల్, ఐబీఎం, ఒరాకిల్, యాక్సెంచర్, డెల్, వీఎం వేర్‌ తదితర కంపెనీలు ఫుల్‌స్టాక్‌ డెవలపర్లను నియమించుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా డాట్‌ కామ్‌.. టాప్‌ రిక్రూటర్స్‌గా నిలుస్తున్నారు. 

జాబ్‌ ప్రొఫైల్స్‌
ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో.. ప్రాజెక్ట్‌ మేనేజర్, బిజినెస్‌ అనలిస్ట్, సిస్టమ్‌ ఆర్కిటెక్ట్, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైనర్, క్వాలిటీ అనలిస్ట్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వంటి హోదాలతో కెరీర్‌ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం హాట్‌ జాబ్‌ ప్రొఫైల్‌గా మారిన ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్స్‌కు సంస్థలు ఆకర్షణీయ వేతనాలు అందిస్తున్నాయి. ఇండీడ్, గ్లాస్‌డోర్, పేస్కేల్‌ తదితర సంస్థల గణాంకాల ప్రకారం– ఫుల్‌ స్టాక్‌ డెవలపర్లకు ప్రారంభంలో రూ.5.2–7.5 లక్షల మధ్య వార్షిక ప్యాకేజీలు లభిస్తున్నాయి.


నైపుణ్యార్జనకు మార్గాలు
ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ స్కిల్స్‌ సొంతం చేసుకోవడానికి  ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మార్గాల్లో సదరు ప్రోగ్రామింగ్, కోడింగ్‌ స్కిల్స్‌పై పట్టు సాధించొచ్చు. యుడెమీ, కోర్స్‌ఎరా వంటి మూక్‌ ప్రొవైడర్స్‌ ద్వారా నైపణ్యాలు పొందొచ్చు. 

#Tags