Grade B Officer Notification : గ్రేడ్–బి ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. మూడు విభాగాల్లో మొత్తం 94 ఆఫీసర్ ఉద్యోగాలు
గ్రాడ్యుయేట్లకు, ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణులకు గ్రేడ్–బి ఆఫీసర్‌గా ఎంపికయ్యే అవకాశం కల్పిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో వినూత్న కెరీర్ కోరుకునే వారికి ఇది చక్కటి అవకాశం!! ఈ నేపథ్యంలో.. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గ్రేడ్–బి ఆఫీసర్ పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ తదితర సమాచారం..
మొత్తం పోస్టుల సంఖ్య 94
ఆర్‌బీఐ విడుదల చేసిన గ్రేడ్–బి ఆఫీసర్ నోటిఫికేషన్ ద్వారా బ్యాంకులోని మొత్తం మూడు విభాగాల్లో 94 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఇందులో గ్రేడ్–బి ఆఫీసర్ (జనరల్)–66 పోస్ట్‌లు; గ్రేడ్–బి ఆఫీసర్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్–డీఈపీఆర్)–21 పోస్ట్‌లు; గ్రేడ్–బి ఆఫీసర్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్–డీఐఎస్‌ఎం)–7 పోస్ట్‌లు ఉన్నాయి.
Paris Olympics: 24 ఏళ్ల తర్వాత.. ఇథోయోపియా అథ్లెట్‌కు పసడి పతకం
అర్హతలు
➔ సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంఏ/పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
➔ వయసు: ఆగస్ట్ 1, 2024 నాటికి 21–30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
మూడంచెల ఎంపిక
గ్రేడ్–బి ఆఫీసర్ పోస్ట్‌ల నియామకానికి ఆర్‌బీఐ మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అవి..ఫేజ్–1 రాత పరీక్ష; ఫేజ్–2 రాత పరీక్ష; పర్సనల్ ఇంటర్వ్యూ. ఫేజ్–1, ఫేజ్–2లుగా నిర్వహించే రాత పరీక్ష మూడు విభాగాల(గ్రేడ్ బీ ఆఫీసర్ –జనరల్, గ్రేడ్–బి ఆఫీసర్ డీఈపీఆర్, గ్రేడ్ బి ఆఫీసర్ డీఐఎస్‌ఎం)కు వేర్వేరుగా ఉంటుంది.
గ్రేడ్–బి ఆఫీసర్(జనరల్) రాత పరీక్ష
గ్రేడ్–బి ఆఫీసర్(జనరల్) పోస్ట్‌లకు సంబంధించి ఫేజ్–1లో 200 మార్కులకు జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ఫేజ్–1 పరీక్షలో సెక్షన్ల వారీగా, మొత్తంగా నిర్దేశిత కటాఫ్ సాధించిన వారికి ఫేజ్–2కు ఎంపిక చేస్తారు.
Current Affairs: ఆగస్టు 11వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!
మూడు వందల మార్కులకు ఫేజ్–2
గ్రేడ్–బి ఆఫీసర్(జనరల్) పోస్ట్‌లకు రెండో దశలో నిర్వహించే ఫేజ్–2 రాత పరీక్ష మూడు పేపర్లలో మూడు వందల మార్కులకు ఉంటుంది. పేపర్–1లో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ 100 మార్కులకు, పేపర్–2లో ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ 100 మార్కులకు, పేపర్–3లో జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ 100 మార్కులకు ఉంటాయి. పేపర్–1, పేపర్–3లలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఒక మార్కు, రెండు మార్కులతో 30 ప్రశ్నలు ఉంటాయి.
ఇలా మొత్తం 50 మార్కులతో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మరో 50 మార్కులకు డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు అభ్యర్థులు వ్యాసరూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు ప్రశ్నలు అడుగుతారు. వీటిలో కనీసం నాలుగింటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రెండు ప్రశ్నలకు 15 మార్కులు చొప్పున, మరో రెండు ప్రశ్నలకు 10 మార్కులు చొప్పున కేటాయిస్తారు.
డీఈపీఆర్ పరీక్షలు
డీఈపీఆర్ విభాగాల్లోని గ్రేడ్–బి ఆఫీసర్ పోస్ట్‌లకు తొలిదశలో రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటాయి. తొలిదశ రాత పరీక్షను మూడు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్–1లో ఎకనామిక్స్ నుంచి ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. పేపర్–2లో ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ విభాగం ఉంటుంది. ఫేజ్–2లో పేపర్–1, పేపర్–2లు ఉంటాయి. రెండు పేపర్లలోనూ ఎకనామిక్స్‌లో డిస్క్రిప్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కులకు ఫేజ్–1; మరో 200 మార్కులకు ఫేజ్–2 పరీక్షలు నిర్వహిస్తారు.
Top Universities And Colleges 2024 in India : దేశంలో టాప్ యూనివర్సిటీలు, కాలేజీలు ఇవే.. వీటిలో చదివితే..!
పేపర్–1లో ఉత్తీర్ణత సాధిస్తేనే
గ్రేడ్–బి ఆఫీసర్ డీఈపీఆర్/డీఎస్‌ఐఎంకు సంబంధించి పేపర్–1లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారికే పేపర్–2, పేపర్–3కు అనుమతి లభిస్తుంది. ముందుగా పేపర్–1, ఆ తర్వాత కొద్దిరోజులకు పేపర్–2, 3లను నిర్వహిస్తారు.
గ్రేడ్–బి ఆఫీసర్(డీఐఎస్‌ఎం).. స్టాటిస్టిక్స్ పేపర్లు
గ్రేడ్–బి ఆఫీసర్(డీఐఎస్‌ఎం) పోస్ట్‌ల ఎంపిక విధానం కూడా డీఈపీఆర్ గ్రేడ్–బి ఆఫీసర్ మాదిరిగానే ఉంటుంది. మూడు పేపర్లుగా మూడు వందల మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్–1, 2లలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్–3లో ఇంగ్లిష్ విభాగం ఉంటుంది. అదే విధంగా పేపర్–1ను ఆబ్జెక్టివ్ విధానంలో, పేపర్–2, పేపర్–3లను డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. పేపర్–1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకే పేపర్–2, పేపర్–3లకు అర్హత లభిస్తుంది.
ఇంటర్వ్యూకు 75 మార్కులు
రాత పరీక్షల్లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులతో మెరిట్ జాబితా రూపొందిస్తారు. వారికి చివరి దశలో 75 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలోనూ సత్తా చాటి.. తుది విజేతల జాబితాలో నిలిస్తే.. గ్రేడ్–బి ఆఫీసర్‌గా అభ్యర్థులు ఎంచుకున్న విభాగాల్లో కొలువు ఖరారు చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ కంటే ముందు సైకోమెట్రిక్ టెస్ట్‌ను కూడా నిర్వహించే అవకాశముంది.
Faculty Posts : ఎస్‌పీఏలో రెగ్యులర్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తులు.. పోస్టుల వివరాలు ఇలా..
ఆకర్షణీయ వేతనం
ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి కొలువు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనంతో కెరీర్ ప్రారంభం అవుతుంది. ప్రారంభంలోనే రూ.55,200–రూ.99,750 వేతన శ్రేణి లభిస్తుంది. వీటికి అదనంగా హెచ్‌ఆర్‌ఏ, డీఏ, ఫ్యామిలీ అలవెన్స్, గ్రేడ్ అలవెన్స్ కూడా అందుతాయి.
కెరీర్ స్కోప్
ఆర్‌బీఐ గ్రేడ్–బి ఆఫీసర్ హోదాలో కెరీర్ ప్రారంభించిన అభ్యర్థులు భవిష్యత్తులో ఉన్నత హోదాలను అందుకునే అవకాశం ఉంది. సర్వీస్ నియమావళిని అనుసరించి ఏడేళ్ల తర్వాత గ్రేడ్–సి ఆఫీసర్‌గా, ఆ తర్వాత మరో అయిదేళ్లకు గ్రేడ్–డి ఆఫీసర్లుగా పదోన్నతి లభిస్తుంది. సీజీఎం, రీజనల్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ వంటి పోస్ట్‌లకు కూడా చేరుకునే అవకాశం ఉంది.
ముఖ్య సమాచారం
➔ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
➔ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఆగస్ట్ 16
➔ గ్రేడ్–బి ఆఫీసర్(జనరల్) ఫేజ్–1 పరీక్ష: సెప్టెంబర్ 8; ఫేజ్–2 పరీక్ష: అక్టోబర్ 19
➔ గ్రేడ్–బి ఆఫీసర్(డీఈపీఆర్) ఫేజ్–1 పరీక్ష: సెప్టెంబర్ 14; ఫేజ్–2 పరీక్ష: అక్టోబర్ 26
➔ గ్రేడ్–బి ఆఫీసర్ (డీఐఎస్‌ఎం) ఫేజ్–1 పరీక్ష: సెప్టెంబర్ 14; ఫేజ్–2 పరీక్ష: అక్టోబర్ 26.
➔ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://opportunities.rbi.org.in/Scri-pts/bs_viewcontent.aspx?Id=4470
GAIL Non Executive Posts : గెయిల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
రాత పరీక్షలో విజయం సాధించేలా
➔ ఆర్‌బీఐ గ్రేడ్–బి ఆఫీసర్ పోస్ట్‌లకు నిర్వహించే రాత పరీక్షల్లో మెరుగైన స్కోర్ సాధించడానికి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న పోస్ట్, అందుకు నిర్దేశించిన సబ్జెక్ట్‌లకు సంబంధించి పీజీ స్థాయి అకడమిక్ నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి.
➔ ఆర్థిక,సామాజిక అంశాలు,జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం,ఇండియన్ ఎకానమీ, గ్లోబలైజేషన్, భారత సామాజిక విధానం, ఆర్థిక వ్యవస్థ, ఆర్‌బీఐ విధులు, ఇతర ఆర్థిక సంస్థలు, దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ మార్కెట్స్, పీపీపీ, కార్పొరేట్ గవర్నెన్స్, బడ్జెట్, ద్రవ్యోల్బణం, ఫిన్‌టెక్, మేనేజ్‌మెంట్ ప్రాథమిక అంశాలు, లీడర్‌షిప్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ వంటి అంశాలపై అవగాహన పొందాలి.
➔ గ్రేడ్–బి ఆఫీసర్ డీఈపీఆర్ అభ్యర్థులు పీజీ స్థాయిలో ఎకనామిక్స్ పుస్తకాలతోపాటు ఆర్‌బీఐ ప్రచురణలు, వార్షిక నివేదికలు, బ్యాంకింగ్ రంగ తీరుపై విడుదలవుతున్న నివేదికలు, ద్రవ్య విధానం, ఎకనామిక్ సర్వేలను అభ్యసనం చేయాలి.
Engineering Seat Allotment: కంప్యూటర్ కోర్సుల్లో 98 శాతం భర్తీ.. ఈ నెలాఖరులోగా క్లాసులు ప్రారంభం
➔ గ్రేడ్–బి ఆఫీసర్ డీఐఎస్‌ఎం అభ్యర్థులు ప్రాబబిలిటీ, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, శాంపిల్ థియరీ, ఎస్టిమేషన్, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, టెస్టింగ్ ఆఫ్ హైపోథిసెస్, లీనియర్ మోడల్స్ అండ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్, న్యూమరికల్ అనాలిసిస్ అండ్ బేసిక్ కంప్యూటర్ టెక్నిక్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
➔ ఇంగ్లిష్‌కు సంబంధించి కాంప్రహెన్షన్, రీడింగ్, ప్యాసేజ్‌లను అర్థం చేసుకోవడం, భావ వ్యక్తీకరణలపై దృష్టి పెట్టాలి.
➔ గ్రేడ్–బి ఆఫీసర్ జనరల్.. పేపర్–1లో జనరల్ అవేర్‌నెస్ కోసం స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలి. అదే విధంగా హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీలను అధ్యయనం చేయాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు సంబంధించి గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి అర్థమెటిక్ అంశాల(రేషియోస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రిలేషన్స్ తదితర)ను ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్‌కు సంబంధించి కోడింగ్, డీ–కోడింగ్, సిలాజిజమ్, నంబర్ సిరీస్‌లపై దృష్టి పెట్టాలి.