Skip to main content

Paris Olympics: 24 ఏళ్ల తర్వాత.. ఇథోయోపియా అథ్లెట్‌కు పసడి పతకం

ఒలింపిక్స్‌లో పురుషుల మారథాన్‌ ఈవెంట్‌లో తమిరాత్‌ తోలా విజేతగా నిలిచి ఇథియోపియాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు.
Paris Olympics: Gold for an Ethiopian athlete in the marathon   2024 Olympic Games Marathon

ఆగ‌స్టు 10వ తేదీ జరిగిన మారథాన్‌ రేసులో నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 32 ఏళ్ల తోలా అందరికంటే వేగంగా 2 గంటల 6 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

బెల్జియం క్రీడాకారుడు బషీర్‌ ఆబ్ది రజతం.. కెన్యాకు చెందిన‌ బెన్సన్‌ కిప్రోతో కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ పురుషుల మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్‌ స్వర్ణ పతకం సాధించడం విశేషం. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఇథియోపియా అథ్లెట్‌ గెజాహెగ్నె అబెరా మారథాన్‌ విజేతగా నిలిచాడు. 

మరోవైపు మారథాన్‌లో ‘హ్యాట్రిక్‌’ ఒలింపిక్‌ స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన కెన్యా దిగ్గజం ఎలూడ్‌ కిప్‌చోగే అనూహ్యంగా విఫలమయ్యాడు. 40 ఏళ్ల కిప్‌చోగే 30 కిలోమీటర్లు పరుగెత్తాక రేసు నుంచి వైదొలిగాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కిప్‌చోగే స్వర్ణ పతకాలు సాధించాడు. కిప్‌చోగే ‘పారిస్‌’లోనూ విజేతగా నిలిచిఉంటే ఒలింపిక్స్‌ మారథాన్‌ చరిత్రలో మూడు బంగారు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించేవాడు.

Sydney Mclaughlin: ప్రపంచ రికార్డు.. ఈ ఈవెంట్‌లో వరుసగా రెండు స్వర్ణాలు సాధించిన మ‌హిళ ఈమెనే..

Published date : 13 Aug 2024 08:53AM

Photo Stories