Skip to main content

Sydney Mclaughlin: ప్రపంచ రికార్డు.. 400 మీటర్ల హర్డిల్స్‌లో వరుసగా రెండు స్వర్ణాలు సాధించిన మ‌హిళ ఈమెనే..

పారిస్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికా మహిళా అథ్లెట్‌ సిడ్నీ మెక్లాఫ్లిన్‌ స్వర్ణ ప‌థ‌కం సాధించింది.
Sydney Mclaughlin Levrone wins women’s 400m hurdles gold with World Record

ఒలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్‌ను ప్రవేశపెట్టి 40 ఏళ్లయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏ అథ్లెట్‌ వరుసగా రెండు స్వర్ణాలు సాధించలేదు. కానీ ‘పారిస్‌’లో అమెరికా క్రీడాకారిణి సిడ్నీ మెక్లాఫ్లిన్‌ లెవ్రోన్‌ ఈ ఘనత సాధించింది. 

టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన సిడ్నీ మెక్లాఫ్లిన్‌ అదే ఫలితాన్ని పారిస్‌లో పునరావృతం చేసింది. ఈసారి ఏకంగా కొత్త ప్రపంచ, ఒలింపిక్‌ రికార్డులను కూడా సృష్టించింది. ఆగ‌స్టు 9వ తేదీ జరిగిన 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 25 ఏళ్ల సిడ్నీ 50.37 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ, ఒలింపిక్‌ రికార్డులను నెలకొల్పింది. 

ఈ ఏడాది జూన్ 30వ తేదీ 50.65 సెకన్లతో తానే సాధించిన ప్రపంచ రికార్డును సిడ్నీ తిరగరాసింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సిడ్నీ 51.46 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకం నెగ్గింది. ఈ సమయాన్ని కూడా ఆమె ‘పారిస్‌’లో అధిగమించింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ విభాగంలో సిడ్నీ మెక్లాఫ్లిన్‌ ఐదుసార్లు కొత్త ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది.

Joshua Cheptegei: ఒలింపిక్స్‌లో చెప్తెగాయ్‌కు స్వర్ణం.. నాలుగేళ్లుగా ఈయ‌న పేరిట ఉన్న ప్రపంచ రికార్డు!

Published date : 10 Aug 2024 02:37PM

Photo Stories