Apprenticeship : ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటీస్‌షిప్.. దరఖాస్తులకు గడువు!
కడప: ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించి డీజల్ మెకానిక్ 40, మోటారు మెకానిక్ 9, ఎలక్ట్రిషియన్ 5, వెల్డర్ 1, పెయింటర్ 1, మెషనిస్ట్ 5, ఫిట్టర్ 3, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ 1 కలిపి మొత్తం 65 ఖాళీలు ఉన్నాయన్నారు. అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించి డీజల్ మెకానిక్ 36, మోటారు మెకానిక్ 5, ఎలక్ట్రిషియన్ 4, వెల్డర్ 1, పెయింటర్ 1, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ 1 కలిపి మొత్తం 48 ఖాళీలు ఉన్నాయన్నారు.
అభ్యర్థులు ఈనెల 5 నుంచి 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో www.apprenticeshipindia.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జిరాక్స్ కాపీల సెట్‌తో వెరిఫికేషన్ కోసం కర్నూలులోని జోనల్ సిబ్బంది ట్రైనింగ్ కళాశాలలో పత్రికా ముఖంగా తెలియజేసే తేదీలను బట్టి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. వెరిఫికేషన్‌కు ఫీజు కింద రూ. 118 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Apprenticeship
- ITI candidates
- applications for jobs 2024
- Jobs 2024
- apprentice recruitments
- apprenticeship at rtc
- online applications
- november 5th to 19th
- ITI graduates
- District Public Transport Officer
- apprentice jobs at rtc
- rtc recruitments
- Education News
- Sakshi Education News
- KadapaApprenticeship
- ITIGraduateOpportunities
- PublicTransportKadapa
- DistrictTransportKadapa
- JobOpportunities