Intermediate Exams: నేటి నుంచి కళాశాలల్లో ఇంటర్‌ మార్కుల లిస్టులు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్‌ –2023 వార్షిక పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు మార్కుల లిస్టులను (ఒరిజినల్‌ మార్క్స్‌ మెమో)ను సంబంధిత జూనియర్‌ కళాశాల నుంచి పొందవచ్చని ఇంటర్మీడియెట్‌ బోర్డు ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రాంతీయ అధికారి పెదపూడి రవికుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఇంటర్మీడియెట్‌ బోర్డు ఉమ్మడి జిల్లా కార్యాలయం నుంచి ఆయా ప్రిన్సిపాల్స్‌ మార్కుల లిస్టులను తీసుకెళ్లారని, సంబంధిత విద్యార్థులు వారివారి కళాశాలలకు వెళ్లి, వాటిని పొందవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్‌ తక్షణమే విద్యార్థులకు వాటిని అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

చ‌ద‌వండి: AP Inter 1st Year Study Material

#Tags