Inter Student Appreciation: ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన యువతికి అభినందనలు..
పెనమలూరు: కృష్ణా జిల్లాలో 2024–2025 విద్యా సంవత్సరానికి 18 హైస్కూళ్లను (ప్లస్ టూ) బాలబాలికల జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి తాహేరా సుల్తానా అన్నారు. కానూరులో శుక్రవారం అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2022–2023 సంవత్సరం నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు 23 హైస్కూల్స్‌లో ఫ్లస్‌టూ ప్రారంభించామన్నారు.
Good News for Medical Workers: వైద్యారోగ్యశాఖలోని 16 వేలకుపైగా పోస్టుల గడువు పొడిగింపు
గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల కంటే ఈ ఏడాది ఫలితాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. అనుకున్న లక్ష్యం సాధించాలంటే లోపాలు గుర్తించి సమష్టిగా పని చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని, ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇప్పటి నుంచే ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. సప్లిమెంటరీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
APSET Halltickets Released: ఏపీసెట్ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
కాగా మోపిదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండో సంవత్సరం ఇంటర్‌లో 933/1000 మార్కులు సాధించిన రాజోలు జ్ఞాననాగప్రసన్నకు దాత ఇచ్చిన రూ. 5 వేల చెక్కు డీఈఓ అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి అశోక్‌చక్రవర్తి, జిల్లా కామన్ ఎగ్జామ్‌బోర్డు కార్యదర్శి షేక్ జాన్‌సాహెబ్, అధికారులు ఎం.శ్రీనివాసరావు, పెనమలూరు ఎంఈఓలు శేషగిరిరావు, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.