AP Inter Supplementary Exams: ముగిసిన ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు.. గైర్హాజ‌రైన విద్యార్థుల సంఖ్య‌..!

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల్లో ద‌ర‌ఖాస్తులు చేసుకున్న‌, పాల్గొన్న విద్యార్థుల సంఖ్య‌ను వివ‌రించారు..

అనంతపురం: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పరీక్షలు జరిగాయి. ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 7,150 మందికి గాను 6,743 మంది హాజరయ్యారు. 407 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 457 మందికి గాను 337 మంది హాజరయ్యారు. 120 మంది గైర్హాజరయ్యారు.

DEE Results and Counselling 2024: డీఈఈ కోర్సుకు సంబంధించి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల‌.. అర్హుల‌కు జూన్ 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం..

మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 1,361 మందికి గాను 1,274 మంది హాజరయ్యారు. 87 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 124 మందికి గాను 102 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కమిటీ జిల్లా కన్వీనర్‌, ఆర్‌ఐఓ ఎం.వెంకటరమణనాయక్‌ 5 కేంద్రాలు, డీఈసీ సభ్యులు 5 కేంద్రాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 5 కేంద్రాలు, సిట్టింగ్‌ స్క్వాడ్‌ 4 కేంద్రాలను తనిఖీలు చేశారు.

Gurukula Staff Issues: గురుకుల సిబ్బంది సమస్యలపై వినతి

#Tags