AP Inter Exams: ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్‌ పరీక్షలకు జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చేసిన విధానం గురించి వివరించారు అధికారులు..

నెల్లూరు: ఇంటర్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 81 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిల్లో ప్రభుత్వ 27, ప్రైవేటు 54 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలను 27 జోన్లుగా విభజించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Intermediate Exams: మార్చి 1 నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ‍మొదలు..

పరీక్షలు జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించనున్నారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో విద్యార్థుల ఇబ్బందుల పరిష్కారం కోసం ఆర్‌ఐఓ కార్యాలయంలో కంట్రోలు రూంను ఏర్పాటు చేశారు. సమస్యలపై 0861– 2320312 నంబరుకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థుల హాల్‌ టికెట్లను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచారు. నేరుగా విద్యార్థులే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెబుతున్నారు.

Intermediate Exams 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

హాజరుకానున్న విద్యార్థులు

ఇంటర్‌ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 52,076 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్‌ 25,202, ఒకేషనల్‌ 1217 మంది కలిపి 26,419 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్‌ 24,243, ఒకేషనల్‌ 1414 మంది కలిపి మొత్తం 25,657 మంది ఉన్నారు. పరీక్ష సమయానికి అరంగంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జిల్లాలో 7 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. వీటిల్లో చేజర్ల, కుల్లూరు, రాపూరు, మర్రిపాడు, ఆత్మకూరు, బిట్రగుంట, ఉదయగిరి ప్రాంతాల్లోని కేంద్రాలు ఉన్నాయి.

Corporate Education: పేద విద్యార్థులకు పాఠశాలలో ఉచిత ప్రవేశాల అవకాశం..!

పకడ్బందీగా నిర్వహణ

ఇంటర్‌ పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. 81 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 81 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించారు. 1200 మందికి పైగా ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరో 16 మంది కస్టోడియన్లును ఏర్పాటు చేశారు. పరీక్షలు జరుగు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. 5 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.

Eamcet Results: ఎంసెట్‌ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలను సమీపంలోని పోలీసు స్టేషన్లుకు పంపించారు. పరీక్షలు జరిగే సమీప ప్రాంతాల్లో జెరాక్స్‌, ఆన్‌లైన్‌ దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని అధికారులు కల్పించారు. పరీక్షలు జరుగు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

Kasturba Gandhi Balika Vidyalaya: అభాగ్యులకు అండగా నిలిచిన కస్తూర్బాగాంధీ విద్యాలయం

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించేందుకు కంట్రోలు రూంను ఏర్పాటు చేశాం. హాల్‌ టికెట్లను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కంట్రోలు రూంకు ఫోన్‌ చేసినట్లయితే వెంటనే పరిష్కరిస్తాం. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి.

  -ఎ.శ్రీనివాసులు, ఆర్‌ఐఓ

Osmania University: ఓయూ పూర్వవిద్యార్థి భారీ విరాళం

#Tags