AP DSC 2024 Notification Release Date : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీ ఇదే.. సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం...!
ఈ టెట్ 2024 ఫలితాలు విడుదలైన మరుసరటి రోజే అనగా నవంబర్ 3వ తేదీన మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తం ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ అంటే...?
డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై తొలి సంతకం చేస్తానని ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఫైల్ పై తొలి సంతకం చేశారు. గత వైఎస్సార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6100 పోస్టులతో పాటు.. దానికి మరో 10 వేలకు పైగా పోస్టులు కలిపి ఈ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం.
డిసెంబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో..
టెట్ ఫలితాలు విడుదల తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
డీఎస్సీ-2024 సిలబస్‌లో..
అదే విధంగా డీఎస్సీ సిలబస్ పై కూడా స్పష్టత ఇచ్చింది. డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యధావిధిగా పాత సిలబస్‌ను కొనసాగించడానికి నిర్ణయించింది.