AP DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్‌.. ఎస్‌జీటీ పోస్టులే అధికం, గుర్తించిన ఖాళీలివే!

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన విషయం విధితమే.
AP DSC Notification

ఆ మేరకు సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన రోజే సంబంధిత ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అయితే నాలుగు నెలలు ముగుస్తున్నా  డీఎస్సీ నోటిఫికేషన్‌ ఊసేలేదు. టెట్‌ పరీక్ష ఫలితాలు సైతం విడుదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్‌ పోస్టుల ఖాళీలను గుర్తించారు. దీనిపై నివేదికలను సైతం పంపించారు.

వివిధ కేడర్ల వారీగా భర్తీ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 7,757 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా బడుల్లోని ఖాళీలను గుర్తించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. 2025 ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఏర్పడే ఖాళీలను అనుసరించి డీఎస్సీ పోస్టుల భర్తీకి కసరత్తు చేశారు. మొత్తం 1,473 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

☛➤ AP Constable Jobs 2024: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. డిసెంబర్‌లో ఫిజికల్‌ టెస్టులు

ఎస్‌జీటీ పోస్టులే అధికం

ఈ రెండు జిల్లాల పరిధిలో డిఎస్సీ ద్వారా ఎస్జీటీ పోస్టులే అధికంగా భర్తీ చేయనున్నారు. మొత్తం 1,473 పోస్టులకు గాను వివిధ సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ పోస్టులు 543 ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 930 పోస్టులు ఎస్‌జీటీ కేడర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతు న్నారు. ఈ డీఎస్సీలో డీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులే ఎక్కువగా పోటీ పడనున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు తక్కువగా ఉండడంతో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు మరోసారి నిరాశే మిగిలింది.

AP DSC Bad News 2024 : ఇది మెగా డీఎస్సీ కాదు.. చోటా డీఎస్సీ మాత్ర‌మే... అభ్య‌ర్థుల‌ను దారుణంగా మోసం..!

నిబంధనల ప్రకారం కసరత్తు

ఉన్నతాధికారులు సూచించిన నిబంధనల ప్రకారం కసరత్తు నిర్వహించాం. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు పంపించాం. వారు మరో పర్యాయం క్షుణ్ణంగా నివేదికలను పరిశీలించి డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఖాళీలను ప్రకటిస్తారు.

– వెంకటేశ్వరరావు, ఏడీ,డీఈఓ కార్యాలయం, చిత్తూరు

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags