ప్రైవేటు పాఠశాలల్లో ‘విద్యాహక్కు’ సీటు ఫీజు ఖారారు

రాష్ట్రంలో ప్రస్తుత (2022–23) విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌ విద్యాహక్కు చట్టం కమిటీ సభ్యులకు సూచించారు.
ప్రైవేటు పాఠశాలల్లో ‘విద్యాహక్కు’ సీటు ఫీజు ఖరారు

ఆయన జూలై 14న సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో విద్యాహక్కు చట్టం కమిటీ సభ్యులతో ఫీజుల ఖరారుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కమిటీ సభ్యుల సూచనలు సలహాలు తీసుకున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను భర్తీచేయాలని కోరారు. ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజు రూ.15 వేలుగా ఖరారు చేసినట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలుకు ప్రభుత్వం విధివిధానాలు రూపొందించిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ సహాయ కార్యదర్శి బి.శ్రీనివాసులు, పాఠశాలవిద్య కమిషనర్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు (ఇన్‌చార్జి) ఎస్‌.సురేష్‌కుమార్, కమిటీ సభ్యులు ఎం.వి.రామచంద్రారెడ్డి కె.చంద్రశేఖర్, కె.శ్రీకాంత్‌బాబు, డాక్టర్‌ సీహెచ్‌ కీర్తి, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

చదవండి: 

#Tags